G20 Summit: చర్చలు జరిపే విధానం ఇది కాదు.. జీ20 సదస్సులో కెనడా ప్రధానిపై జిన్‌పింగ్ ఆగ్రహం.. వీడియో

|

Nov 17, 2022 | 7:12 AM

జీ20 సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రత్యేకంగా సమావేశమై.. ఇరు దేశాల సంబంధాలు, పలు అంశాలపై చర్చించారు.

G20 Summit: చర్చలు జరిపే విధానం ఇది కాదు.. జీ20 సదస్సులో కెనడా ప్రధానిపై జిన్‌పింగ్ ఆగ్రహం.. వీడియో
Justin Trudeau Xi Jinping
Follow us on

G20 Summit China – Canada: ఇండోనేషియా బాలి వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు చైనా – కెనడా మధ్య వేడి రాజేసింది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే డ్రాగన్ కంట్రీ చైనా.. జీ20 వేదికగా ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల వివరాలు బహిర్గతం కావడంపై కెనడాపై అసహనం వ్యక్తం చేసింది. G20 శిఖరాగ్ర సమావేశంలో తమ క్లోజ్డ్ డోర్ సమావేశానికి సంబంధించిన అంశాలను లీక్ చేశారనే ఆరోపణలపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ (Xi Jinping) బుధవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) ను వ్యక్తిగతంగా విమర్శించారు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. జీ20 సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రత్యేకంగా సమావేశమై.. ఇరు దేశాల సంబంధాలు, పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఈ భేటీకి సంబంధించిన వివరాలు మీడియాలో వచ్చాయి. దీంతో ట్రూడో తీరుపట్ల జిన్‌పింగ్‌ తన అంసతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ కెనడా జర్నలిస్టు రికార్డు చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

‘‘మనం చర్చించిన విషయాలు మీడియాలో వచ్చాయి. ఇది సరైన పద్ధతికాదు.. చర్చలు జరిపే విధానం ఇది కాదు’’ అంటూ జిన్‌పింగ్.. కెనడా ప్రధాని ట్రూడోపై అసహనం వ్యక్తంచేశారు. దీనిపై ట్రూడో మాట్లాడుతూ..‘‘కెనడాలో ప్రతిదీ పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలని మేం భావిస్తామని.. కలిసి పనిచేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధం. కానీ, కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం సాధ్యంకాదు’’ అంటూ జిన్‌పింగ్‌కు బదులిచ్చినట్టుగా ఆ వీడియోలో రికార్డయింది అనంతరం ఇరుదేశాల నేతలు పరస్పరం కరచాలనం చేసుకుని ఎవరి దారిలో వారు వెళ్లిపోవడం ఈ వీడియోలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కాగా.. మూడేళ్ల అనంతరం చైనా అధ్యక్షుడు జీన్‌పింగ్, కెనడా ప్రధాని ట్రూడో మధ్య జీ20 సదస్సు వేదికగా చర్చలు జరిగాయి. ఈ భేటీలో ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్టు తెలుస్తోంది.

ప్రపంచ వార్తల కోసం..