Omicron Variant: ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్‌’ వేరియంట్‌గా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన WHO..పేద దేశాలకు వాక్సిన్ ఇవ్వాలని పిలుపు

|

Nov 30, 2021 | 8:53 AM

Omicron Variant: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వేరియంట్‌ 'ఒమిక్రాన్‌' వ్యాధి తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదని..

Omicron Variant: ఒమిక్రాన్‌ను హై రిస్క్‌ వేరియంట్‌గా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన WHO..పేద దేశాలకు వాక్సిన్ ఇవ్వాలని పిలుపు
Omicron Variant
Follow us on

Omicron Variant: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వ్యాధి తీవ్రతపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పింది. అయిదు కరోనా సెకండ్ వేవ్ లో ప్రపంచ దేశాలలో కల్లోలం సృష్టించి.. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన డెల్టా వేరియంట్ తరహాలో ఈ ఒమిక్రాన్ వ్యాపిస్తుందో లేదో నిర్ధారించే సమాచారం తమదగ్గర లేదని తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్‌’ వేరియంట్‌గా గుర్తిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

అంతేకాదు ఒమిక్రాన్‌ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో స్పష్టంగా చెప్పే సమాచారం లేదని.. దక్షిణాఫ్రికాలో సాధారణంగానే కేసులు పెరిగాయా? లేదంటే ఒమిక్రాన్‌ వల్లే పెరిగాయా? అనే దానిపై పరిశోధనలు పూర్తికాలేదని డబ్యూహెచ్ఓ తెలిపింది. ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉందని WHO హెచ్చరించింది. ఈ వేరియంట్ కొన్ని ప్రాంతాలలో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ప్రకటించింది. ఈ మేరకు WHO అధిపతి డాక్టర్ టెడ్రోస్ పేద దేశాలకు వ్యాక్సిన్‌లను అందించాలని ఇతర దేశాలను కోరారు. ఈ తరుణంలో ‘అంతర్జాతీయ వేదిక’గా ఏర్పడి ప్రపంచ దేశాలన్నీ కోవిడ్‌పై ఉమ్మడి పోరుకు సిద్ధంకావాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చిచ్చారు.

అంతేకాదు కోవిడ్ -19 అంతంకాలేదని.. ఎప్పటికి అంతమవుతుందో తెలియదని అతను హెచ్చరించారు. తమ దేశంలో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిందని.. దీని వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రపంచ దేశాలను ముందుగా హెచ్చరించిన దక్షిణాఫ్రికాపై ప్రశంసల వర్షం కురిపించింది.

Also Read:  నెల్లూరు జిల్లాలో వర్షాలు, వరదల బీభత్సం.. జనజీవనం అస్తవ్యస్తం, పొంగిపొర్లున్న వాగులు వంకలు