ఎన్నికలు నిర్వహించాలా.. మా దగ్గర డబ్బులు లేవు.. పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ధరలు ఆకాశాన్ని తాకాయి. అక్కడ రోజూవారీ కార్యకలాపాల నిర్వహణకూ కూడా నిధులు లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అయితే పాకిస్తాన్ లో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఎన్నికలు నిర్వహించాలా.. మా దగ్గర డబ్బులు లేవు.. పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Pakistan

Updated on: Mar 26, 2023 | 11:33 AM

ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ధరలు ఆకాశాన్ని తాకాయి. అక్కడ రోజూవారీ కార్యకలాపాల నిర్వహణకూ కూడా నిధులు లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అయితే పాకిస్తాన్ లో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలంటే చాలా వరకు ఖర్చవుతుంది. తాజాగా ఇదే అంశంపై అక్కడి ప్రభుత్వానికి ప్రశ్న ఎదురైంది. దీనిపై పాక్‌ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. అసలు ఎన్నికలు నిర్వహించేందుకు ఆర్థిక శాఖ వద్ద నిధులు లేవని తేల్చి చెప్పాడు. దేశం ఇప్పటికే ఎన్నో సమస్యల సుడిగుండంలో చిక్కుకుకుపోయిందని ఎన్నికల ఖర్చు భరించే స్థితిలో దేశం లేదని తెలిపారు. నేతలు, ఆర్మీ ఉన్నకాధికారులందరూ కలిసి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ప్రస్తుతమున్న మార్గమని పేర్కొన్నారు.

మరోవైపు దేశ ఆర్థి వ్యవస్థను చక్కదిద్దాలని కొంతమంది రాజకీయ విశ్లేకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ మార్గంలో ఉన్న అతిపెద్ద అడ్డగింత ఇమ్రన్ ఖాన్ అని ఖవాజా వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయలను ఒక ఆటలాగా చూస్తున్నారని… ఏదైనా చేసి ఎన్నికల్లో గెలవడమే ముఖ్యమనుకుంటున్నారని, అటువంటి రాజకీయాలు సాగవవి స్పష్టం చేశారు. ఆయన కూడా అందరితో కలిసి ముందుకు సాగల్సి ఉంటుందని వెల్లడించారు. తన హత్యకు కుట్ర చేస్తున్నారంటూ ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ రోజూ ఏదో ఒక సంక్షోభం సృష్టిస్తున్నారని.. అయితే ప్రభుత్వం వాటిని ఎదుర్కొంటోందని, త్వరలో ఈ సంక్షోభాలన్ని ముగిసిపోతాయని పేర్కొన్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..