Japan: ఇక లేట్ చేయొద్దు.. పిల్లల్ని కనండి ప్లీజ్.. ఇలానే ఉంటే దేశం కనుమరుగవుతుంది..

|

Mar 07, 2023 | 8:27 AM

తాజా గణాంకాలు జపాన్ ను భయపెడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నాళ్లకు జపాన్ మాయమవుతుందని చెప్పారు ఆ దేశ ప్రధాని. అసలు జాపాన్ ను భయపెడుతున్న సర్వే లెక్కలేంటి? జపాన్ ఎందుకు మాయమవుతుందో చూద్దాం.

Japan: ఇక లేట్ చేయొద్దు.. పిల్లల్ని కనండి ప్లీజ్.. ఇలానే ఉంటే దేశం కనుమరుగవుతుంది..
Japan
Follow us on

తాజా గణాంకాలు జపాన్ ను భయపెడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నాళ్లకు జపాన్ మాయమవుతుందని చెప్పారు ఆ దేశ ప్రధాని. అసలు జాపాన్ ను భయపెడుతున్న సర్వే లెక్కలేంటి? జపాన్ ఎందుకు మాయమవుతుందో చూద్దాం. జనాభా నియంత్రణకు తీసుకొచ్చిన జపాన్ ఆంక్షలు ఆ దేశ మనుగడను ప్రశ్నార్థకంగా మారాయి. గతేడాది జననాల రేటు భారీగా తగ్గిపోవంతో జపాన్ ప్రధానమంత్రి సహాయకులు మసక మోరి కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా రేటు ఇలాగే కొనసాగితే జపాన్ కనుమరుగు అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది జననాల రేటు అత్యల్పంగా నమోదైనట్లు ఫిబ్రవరిలో జపాన్ అధికారులు ప్రకటించారు. 2008లో 12.8 కోట్ల జనాభా ఉండగా, ప్రభుత్వ చర్యలతో 12.4 కోట్లకు పడిపోయింది. దేశంలో జనాభా క్షీణత రేటు క్రమంగా పెరుగుతుందని పలు నివేదికలు ఇప్పటికే వెల్లడించాయి.

ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 29 శాతం పైగా ఉందని తెలిపాయి. అయితే అన్ని దేశాల్లోకెల్లా దక్షిణ కొరియాలో జననాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ, జపాన్ జనాభా మాత్రం వేగంగా తగ్గుతుందని నివేదికలు వెల్లడించాయి. దీనిపై సూదీర్ఘ అధ్యయనం చేసిన సర్వే సంస్థలు కీలక విషయాలను వెల్లడించాయి. పిల్లలను కనే వయస్సులో ఉన్న మహిళల సంఖ్య తగ్గడం జనాభా రేటు తగ్గడానికి కారణమని తెలిపాయి.

జనాభా రేటు పెరిగేందుకు చర్యలు చేపడితే కొంత ఊరట కలుగుతుందని అధికార వర్గాలు సూచించాయి. దీంతో, పిల్లలను పోషించేందుకు, పెంచేందుకు తల్లులకు ప్రోత్సహాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడొచ్చని మోరీ అభిప్రాయం వ్యక్తం చేశారు. గతేడాది జపాన్ లో 8 లక్షల జననాలు సంభవించగా, 15.8 లక్షలు మరణాలు చోటుచేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..