Nepal: భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరులకు నేపాల్‌ హెచ్చరిక!

KVD Varma

KVD Varma |

Updated on: Sep 06, 2021 | 7:45 AM

నేపాల్ లోని షేర్ బహదూర్ దేవుబా ప్రభుత్వం ఏదైనా నిరసన సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తే లేదా భారతదేశ గౌరవానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Nepal: భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరులకు నేపాల్‌ హెచ్చరిక!
Nepal

Nepal: నేపాల్ లోని షేర్ బహదూర్ దేవుబా ప్రభుత్వం ఏదైనా నిరసన సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తే లేదా భారతదేశ గౌరవానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, నేపాల్ ప్రభుత్వం తన పొరుగువారందరితో సన్నిహిత, బలమైన సంబంధాలను కోరుకుంటోందని, విభేదాలు లేదా వివాదాలు ఉంటే, వాటిని దౌత్య స్థాయిలో చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని స్పష్టంగా చెప్పింది.

ఇటీవల, నేపాల్ లోని ధార్చులా ప్రాంతానికి చెందిన ఒక యువకుడు వైర్ సహాయంతో నదిని దాటుతూ భారతదేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో తీగ తెగిపోయి యువకుడు నదిలో కొట్టుకుపోయాడు. నేపాల్‌లోని కొన్ని భారత వ్యతిరేక సంస్థలు భారతదేశం నుండి వైర్‌ను ఎవరో కత్తిరించారని ఆరోపిస్తున్నాయి. ఈ కారణంగా ఆ యువకుడు నదిలో పడి మరణించాడని ఆరోపిస్తూ ప్రజలను రెచ్చగోడుతున్నాయి.

ధార్చుల సంఘటన తరువాత , నేపాల్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. కొన్ని భారత వ్యతిరేక సంస్థలు, ప్రత్యేకించి వామపక్ష సంస్థలు నేపాల్‌లో ప్రదర్శనలకు దిగాయి. ఈ సందర్భంగా భారత ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వైర్‌ని భారత సరిహద్దు సాయుధ దళ జవాన్ కత్తిరించాడని సంస్థలు ఆరోపిస్తున్నాయి. వామపక్ష సంస్థలు కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించడానికి ప్రయత్నించాయి. దీని తర్వాత మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సంఘటన తర్వాత నేపాల్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఈ విషయం భారతదేశంతో మాట్లాడటం ద్వారా పరిష్కరించాలి లేదా వ్యతిరేకించే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి అని నేపాల్ వెంటనే ప్రయత్నించలేకపోయింది. దీన్తూ గత కొన్ని రోజులుగా, నేపాల్‌లో కొంతమంది ఈ సమస్యను పెద్దది చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

మూడు రోజుల్లో రెండవ హెచ్చరిక నేపాల్ హోం మంత్రిత్వ శాఖ మూడు రోజుల్లో రెండవ సారి నిరసన తెలిపే వారికి కఠిన హెచ్చరికను ఇచ్చింది. పొరుగు దేశ ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేస్తే, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అయితే ఈ ప్రకటనలో నేరుగా భారతదేశం లేదా భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు వెల్లడించలేదు. కానీ ఈ యువకుడి మరణం కేసు స్పష్టంగా భారతదేశానికి సంబంధించినది కాబట్టి, ఇది భారతదేశం, ప్రధాని మోడీ విషయంలోనే అని స్పష్టంగా అర్ధం అవుతోంది.

ధార్చుల సంఘటన జూలై 30 న జరిగింది. మరణించిన యువకుడి పేరు జై సింగ్ ధామి. నేపాల్ ప్రభుత్వం ఈ విషయాన్ని భారత్‌తో చర్చించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 31 న, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అటువంటి సంఘటన గురించి తమకు తెలియదని స్పష్టం చేసింది. గత వారం ‘కాంతిపూర్ టైమ్స్’ ఒక నివేదికలో అనేక భారత సైనిక హెలికాప్టర్లు నిరంతరం ఎగురుతూ నేపాల్ గగనతలంలో కనిపిస్తున్నాయని పేర్కొంది. దేశంలో భారత్ నిర్వహిస్తున్న అభివృద్ధి ప్రాజెక్టుల గురించి పుకార్లు లేదా ప్రతికూల వ్యాఖ్యలు చేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని నేపాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read: Afghanistan Crisis: పంజ్‌షేర్‌ వ్యాలీలో అసలేం జరుగుతోంది..? ప్రజెంట్ సిట్యువేషన్ ఇది

Afghanistan Crisis: పంజ్‌షీర్‌లో తాలిబన్లకు ఎదురుదెబ్బ.. 6 వందల మంది హతం..! 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu