Covid-19: కరోనా వైరస్ పుట్టిల్లు చైనాలో మరోమారు కోవిడ్-19 డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మొదటిసారిగా కరోనా పాజిటివ్ కేసు నమోదైన చైనా సెంట్రల్ సిటీ అయిన వుహాన్ మరోమారు లాక్‌డౌన్ దిశాగా చేరింది. వుహాన్ శివారులో దాదాపు పది లక్షల మందిని ఇప్పటికే లాక్‌డౌన్‌లో ఉంచారు. వుహాన్‌లో నాలుగు కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడ మళ్లీ లాక్‌డౌన్ విధించారు. జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్రజల్ని ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఈ నేపథ్యంలో పది లక్షల మంది లాక్ డౌన్ లో కి వెళ్లిపోయారు. రవాణావ్యవస్థ కూడా స్తంభించింది.
కోవిడ్ పట్ల చైనా సర్కార్ జీరో కోవిడ్ వ్యూహాన్ని అనుసరిస్తున్న విషయం తెలిసిందే. సామూహిక పరీక్షలు, కఠినంగా ఐసోలేషన్ అమలు చేయడం, స్థానికంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అయినా చైనా అమలు చేస్తున్న కోవిడ్ ఆంక్షల విధానాలతో ప్రజల్లో తీవ్ర అసహనం పెరుగుతోంది. వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి