అఖండ భారతానికి తమ మద్దతు ఉంటుంది, ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌

|

Nov 23, 2020 | 11:28 AM

అఖండ భారతానికి మద్దతు పలికింది నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లను భారత్‌లో విలీనం చేసి ఒక దేశంగా మార్చాలనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి ఉంటే...

అఖండ భారతానికి తమ మద్దతు ఉంటుంది, ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌
Follow us on

అఖండ భారతానికి మద్దతు పలికింది నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లను భారత్‌లో విలీనం చేసి ఒక దేశంగా మార్చాలనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి ఉంటే ఆ ప్రతిపాదనకు తాము కూడా మద్దతు ఇస్తామని ఎన్సీపీ ప్రకటించింది. కరాచీ నగరం భారత్‌లో భాగం అవుతుందన్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్‌ మాలిక్‌ అన్నారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ దేశాలు కూడా భారతదేశంలో విలీనం కావాలని తాము భావిస్తున్నామని తెలిపారు. బెర్లిన్‌ గోడను బ్దదలు కొట్టి ఉభయ జర్మనీలు ఒక్కటయ్యినప్పుడు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లు భారత్‌లో ఎందుకు విలీనం కాకూడదని ప్రశ్నరించారు. మూడు దేశాలను కలిపి అఖండ భారత్‌గా చేయాలని బీజేపీ అనుకుంటే దానికి తమ మద్దతు కూడా ఉంటుందని మాలిక్‌ తెలిపారు. మరో ఏడాదిన్న కాలంలో జరిగే బృహన్‌ ముంబాయి కార్పొరేషన్‌ ఎన్నికలలో కూడా శివసేనతో కలిసి పోటీ చేస్తామని ఎన్సీపీ నేత తెలిపారు. ప్రతీ పార్టీకి బలపడాలనే కోరిక ఉంటుందని, అది హక్కు కూడా అని చెబుతూ తాము కూడా తమ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు నవాబ్‌ మాలిక్‌.