NASA Space Helicopter: నాసా అద్భుతమైన ప్రయోగం.. అంగారకుడిపైకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న హెలికాప్టర్‌

|

Apr 10, 2021 | 1:03 PM

NASA Space Helicopter: అంగారకుడి ఉపరితలంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రవేశపెట్టిన ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ ఎగిరేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హెలికాప్టర్‌ రోటార్లను..

NASA Space Helicopter: నాసా అద్భుతమైన ప్రయోగం.. అంగారకుడిపైకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న హెలికాప్టర్‌
Nasa Space Helicopter
Follow us on

NASA Space Helicopter: అంగారకుడి ఉపరితలంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రవేశపెట్టిన ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ ఎగిరేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హెలికాప్టర్‌ రోటార్లను విజయవంతంగా పరీక్షించినట్లు నాసా శుక్రవారం వెల్లడించింది. ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను రోవర్‌ కెమెరాల సాయంతో చిత్రీకరించి ట్విటర్‌లో విడుదల చేసింది. ఆదివారం హెలికాప్టర్‌ పైకి ఎగరనున్నట్లు నాసా తెలిపింది. హెలికాప్టర్‌ చురుకుగానే పని చేస్తోంది. దాని రోటార్ల పనితీరుపై మేం పరీక్షించాలం. 50 ఆర్పీఎం వేగంతో జాగ్రత్తగారోటార్లను పరీక్షించాం అని హెలికాప్టర్‌ ఆపరేషన్స్‌ లీడర్‌ టిమ్‌ కన్హమ్‌ వెల్లడించారు.

భూమితో పోలిస్తే అంగారకుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ. అందుకే ల్యాండింగ్‌తోపాటు పైకి ఎగరడం కూడా కాస్త కష్టతరమైన విషయం. హెలికాప్టర్‌ ఆపరేషన్‌ కూడా కాస్త రిస్క్‌తో కూడుకున్న పని. కానీ ఈ ప్రక్రియ ద్వారా అంగారక గ్రహంపై ఉండే పరిస్థితుల గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకోవచ్చు అని ప్రాజెక్టు మేనేజర్‌ అంగ్‌ వెల్లడించారు. హెలికాప్టర్‌ నిలువునా పైకి ఎగిరి తిరుగుతూ పర్సెవరెన్స్‌ రోవర్‌ ఫోటోలు తీస్తుందని నానా వెల్లడించింది.

కాగా, అంగారకుడిపై జీవం పుట్టుకకు సంబంధించి నాసా 2020లో రోవర్‌ను పంపిన విషయం తెలిసిందే. అయితే అది ఫిబ్రవరి 18న అంగారకుడిపై ల్యాండ్‌ అయింది. ఆ రోవర్‌ నుంచి ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను నాసా ఇటీవల అంగారకుడి ఉపరితలంపై దింపింది. ఎలాంటి సాంకేతిక సాయం లేకుండానే హెలికాప్టర్‌ అక్కడి వాతావరణానికి తట్టుకోగలుగుతుందని నాసా తెలిపింది.

 

ఇవీ చదవండి: Income Tax Rules: అమల్లోకి వచ్చిన కొత్త ట్యాక్స్‌ నియమాలు… అవగాహన పెంచుకోవాలంటున్న ఆర్థిక నిపుణులు

Covid-19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌ వేసుకుంటే ఉచితంగా బీర్‌ .. మందు బాబులకు అదిరిపోయే ఆఫర్‌