Donald Trump: సునీతా విలియమ్స్‌, విల్మోర్‌లకు అదనపు జీతంపై ట్రంప్‌ సంచలన ప్రకటన! అవసరం అయితే..

|

Mar 22, 2025 | 12:08 PM

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో 9 నెలలు ఉండి వచ్చారు. సాంకేతిక సమస్యల కారణంగా వారి తిరిగి రాక ఆలస్యమైంది. ట్రంప్ ప్రభుత్వం స్పేస్ ఎక్స్ సహాయంతో వారిని తిరిగి భూమికి తీసుకువచ్చింది. అదనపు కాలం గడిపినందుకు వారి జీతం విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. నాసా వారికి కేవలం కొద్దిపాటి అదనపు జీతం మాత్రమే చెల్లించింది.

Donald Trump: సునీతా విలియమ్స్‌, విల్మోర్‌లకు అదనపు జీతంపై ట్రంప్‌ సంచలన ప్రకటన! అవసరం అయితే..
Donald Trump Sunita William
Follow us on

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, విల్మోర్‌లు ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో దాదాపు 9 నెలలు ఉండి వచ్చిన విషయం తెలిసిందే. కేవలం 8 రోజుల మిషన్‌ గురించి గతేడాది ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీతా, విల్మోర్లు వ్యోమనౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అక్కడే ఉండిపోయారు. తర్వాత వారిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా అనేక ప్రయత్నాలు చేసింది. కానీ, రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌కు ఆ బాధ్యత అప్పగించారు. దీంతో నాసా, స్పేస్‌ ఎక్స్‌ కలిసి వ్యోమగాములను భూమిపైకి తిరిగి తీసుకొచ్చారు.

ఇది తమ ప్రభుత్వం సాధించిన విజయమంటూ ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే అనుకున్న సమయానికి కంటే ఎక్కువ కాలం స్పేస్‌లో ఉన్న వారికి అదనపు జీతం చెల్లిస్తారా అని మీడియా ప్రతినిధులు ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి ట్రంప్‌ స్పందిస్తూ.. అవసరం అనుకుంటే.. వారికి తన సొంత నిధుల నుంచి చెల్లిస్తానంటూ వెల్లడించారు. సునీతా విలియమ్స్‌, విల్మోర్‌లను తిరిగి తీసుకురావడంతో సాయం చేసిన ఎలాన్‌ మస్క్‌కు ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన కనుక లేకుంటే.. ఏం జరిగి ఉండేదో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, నాసా వ్యోమగాములకు అదనపు కాలం స్పేస్‌లో ఉన్నందుకు ఎలాంటి అదరపు జీతం చెల్లించరని నాసా ప్రతినిధులు స్పష్టం చేశారు.

స్పేస్‌లో ఉన్నప్పుడు సాధారణ జీతంతో పాటు ఆహారం, బస ఖర్చులను నాసా భరిస్తుంది. ఇలాంటి అనూహ్య పరిణామాలు ఎదురైనప్పుడు కేవలం రోజుకు 5 డాలర్లు అదనంగా చెల్లిస్తుంది. 286 రోజులకు గాను విలియమ్స్‌, విల్మోర్‌లు చెరో 1430 డాలర్లు మాత్రమే అదనంగా పొందుతారు. కాగా వీరికి అమెరికా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతం ఉంటుంది. వ్యోమగాములకు జీఎస్‌13 నుంచి జీఎస్‌ 15 గ్రేడ్‌ మధ్య జీతాలు చెల్లిస్తారు. విలియమ్స్‌, విల్మోర్‌లు సీనియర్లు కావడంతో వీరిద్దరు జీఎస్‌ 15 గ్రేడ్‌ కింద జీతాలు పొందుతున్నారు. ఏడాదికి 1,52,000 డాలర్లు వీరికి జీతంగా చెల్లిస్తారు. మన కరెన్సీలో 13 కోట్ల పైమాటే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.