Headless Creature: తల తోక లేని వింతజంతువు అంటూ ఓ మహిళ హంగామా.. అసలు విషయం తెలిసాక నవ్వులే నవ్వులు

|

Apr 17, 2021 | 12:38 PM

Mysterious Headless Creature: ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు.. మానవ మేధస్సుకు.. సైన్స్ కు అందని రహస్యాలు నిండిఉన్నాయి. అంతరించిపోయిన..

Headless Creature: తల తోక లేని వింతజంతువు అంటూ ఓ మహిళ హంగామా.. అసలు విషయం తెలిసాక నవ్వులే నవ్వులు
Mysterious Headless Animal
Follow us on

Mysterious Headless Creature: ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు.. మానవ మేధస్సుకు.. సైన్స్ కు అందని రహస్యాలు నిండిఉన్నాయి. అంతరించిపోయిన జంతువులతో పాటు అనేక రకాలైన వింత జంతువులు కూడా ఒకొక్కసారి వెలుగులోకి వచ్చి.. హల్ చల్ చేస్తాయి. తాజాగా ఓ వింత జంతువు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తల తోక లేని ఓ వింత జంతువు ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ వింత జంతువు పోలాండ్ లో వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది.
ఈ వింత జంతువుకు కాళ్లు, చేతులు, తల వంటి భాగాలు లేవు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను క్రాకో యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ఫేస్‌బుక్ పేజీ ద్వారా వెల్లడించింది. ఈ సంస్థకు ఇటీవల ఒక మహిళ ఫోన్ చేసింది. తన ఇంటి దగ్గర ఒక వింత జంతువును చూసి చాలా మంది భయపడుతున్నారని, ఎక్కడ తమ ఇంట్లోకి వస్తుందని కిటికీలు కూడా తెరవట్లేదని ఆమె చెప్పింది.
వెంటనే అధికారి ఆ పక్షి గురించి ఎంక్వైరీ చేస్తూ.. అది అనారోగ్య పక్షి అయిఉండొచ్చని చెప్పారు. ఆమె చెప్పిన వివరాలతో ఊసరవెల్లి అయి ఉండొచ్చు అని భావించారు. ఆ మహిళ చెప్పిన అడ్రస్ కు వెళ్లి వింత జంతువును పరిశీలించారు. అది గోధుమ రంగులో వింతగా ఒక కొమ్మపై నక్కి ఉంది. ఏమాత్రం కదలట్లేదు. దానికి కాళ్లు, తల వంటివి కూడా లేవు. అయితే అధికారి ఆడమ్ బృదం మరింత పరిశీలించి చూడగా అది ఏమిటో అర్ధం అయ్యింది. దీంతో వెంటనే వారు నవ్వారు. అసలు అది జంతువు కాదని.. అది పోలెండ్ స్పెషల్ క్రొసియెంట్ అనే ఒక రకమైన బ్రెడ్ అని చెప్పారు. అయితే ఆ బ్రేడ్ ను పక్షాలకు ఆహారం కోసం చెట్టుమీద పెట్టారని భావించారు. ఫేస్ బుక్ లో వింతజంతువు చుడండి అంటూ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం ఓ రేంజ్ లో లైక్స్ షేర్స్ సొంతం చేసుకుంటుంది.

Also Read:  టేస్టీ టేస్టీ మిక్సిడ్ వెజిటబుల్ మసాలా న్యూడిల్స్ తయారీ ఎలా అంటే..!

మనిషి జీవితమే ఈ చిదంబరం ఆలయం .. ఇక్కడ ఎన్నో రహస్యాలు.. అవన్నీ చిదంబర రహస్యమే..!