Mumbai Airport: నేడు ముంబై ఎయిర్ పోర్ట్ 6 గం. పాటు మూసివేత.. రీజన్ ఏమిటంటే

|

Oct 17, 2023 | 12:07 PM

ముంబై విమానాశ్రయంలో రోజుకు 900 విమానాలు తిరుగుతాయి. వేలాదిమంది ఈ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో 5 గంటలపాటు విమానాల రాకపోకలకు బ్రేక్‌ ఇవ్వడంతో తమకు ప్రయాణీకులు సహకరించ వాల్సిందిగా విమానాశ్రయ సిబ్బంది కోరింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ విమాన ట్రాఫిక్ ఆగస్ట్ 2019 ప్రీ-పాండమిక్ స్థాయిలో 108 శాతానికి చేరుకుంది.

Mumbai Airport: నేడు ముంబై ఎయిర్ పోర్ట్ 6 గం. పాటు మూసివేత.. రీజన్ ఏమిటంటే
Mumbai Airport
Follow us on

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నేడు సుమారు 6 గంటల పాటు మూసివేయనున్నారు. మెయింటెనెన్స్ పనులే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ సుమారు 6 గంటల వరకూ విమానాశ్రయాన్ని మూసివేయనున్నారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లోని రెండు రన్‌వేలపై మెయింటెనెన్స్ పనులు జరగనున్నాయి. ఈ సమయంలో ఎటువంటి విమానం ఇక్కడ నుంచి వెళ్లదు. సమాచారం ప్రకారం వర్షాకాలం తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ అంతర్జాతీయ విమానాశ్రయం RWY 09/27, RWY 14/32 రెండు రన్‌వేలు మూసివేయనున్నారు.

అక్టోబర్ 17న అంటే ఈరోజు ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు మూసివేశారు. విమానాశ్రయం సిబ్బంది చెప్పిన ప్రకారం ఈ రన్ వే ల మూసి వేత గురించి 6 నెలల ముందుగానే ఎయిర్‌లైన్‌కు, ఇతర సంబంధిత వ్యక్తులకు తెలియజేసారు.

ప్రతి ఏడాది జరిగే నిర్వహణ పనులు

వాస్తవానికి వర్షాకాలం తర్వాత ప్రతి సంవత్సరం ఈ నిర్వహణ పనులు చేయాల్సి ఉంటుంది. ఈ నిర్వహణ పనిలో భాగంగా రన్‌వే ఉపరితలం వంటి పనులు తనిఖీ చేస్తారు. తద్వారా విమానం సరిగ్గా టేకాఫ్, ల్యాండ్ అవుతుంది. ఇలా రన్ వే మరమత్తులు చేయడం వలన విమానంలో ప్రయాణించే ప్రయాణీకులు సురక్షితంగా ఉండగలరు. వర్షాకాలానికి ముందు ఈ ఏడాది మే 2న విమానాశ్రయం రెండు రన్‌వేల నిర్వహణ, మరమ్మతు పనులు చేపెట్టాల్సి ఉంది. మరమ్మతులు, నిర్వహణ కోసం విమానాశ్రయం తాత్కాలిక మూసివేత ప్రాథమికంగానే అని అధికారులు తెలిపారు. విమానాశ్రయ మౌలిక సదుపాయాలను అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించడానికి ఇది చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

ప్రయాణీకుల సహకారం కోరిన సిబ్బంది

ముంబై విమానాశ్రయంలో రోజుకు 900 విమానాలు తిరుగుతాయి. వేలాదిమంది ఈ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో 5 గంటలపాటు విమానాల రాకపోకలకు బ్రేక్‌ ఇవ్వడంతో తమకు ప్రయాణీకులు సహకరించ వాల్సిందిగా విమానాశ్రయ సిబ్బంది కోరింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ విమాన ట్రాఫిక్ ఆగస్ట్ 2019 ప్రీ-పాండమిక్ స్థాయిలో 108 శాతానికి చేరుకుంది. 4.32 మిలియన్ల మంది ప్రయాణికులు విమానాశ్రయంలో ప్రయాణించారు. ఇందులో ఏడాది ప్రాతిపదికన 32 శాతం పెరుగుదల ఉంది. అంతర్జాతీయ విమాన ట్రాఫిక్ కూడా 33 శాతం పెరిగింది. ఇందులో 1.1 మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించారు. అదే సమయంలో విమానాశ్రయం మొత్తం 20,711 దేశీయ, 6,960 అంతర్జాతీయ విమానాల ట్రాఫిక్ ను ఎదుర్కొంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..