ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఆదివారం జరిగిన పేలుడులో ఇద్దరు మరణించగా, 5 గురు గాయపడ్డారు. భద్రతా దళాలను టార్గెట్ గా చేసుకుని ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో గాయపడిన తమ తల్లి వద్ద కూర్చుని ఆమె పిల్లలు ఇద్దరు అదేపనిగా విలపిస్తున్న వైనం తాలూకు వీడియో వైరల్ అయింది. తమ తల్లికి ఏమైందో తెలియక ఆ చిన్నారులు విలపిస్తున్న దృశ్యాన్నివీడియోగా తీస్తున్న వ్యక్తి..,కామ్ గా ఉండాల్సిందిగా వారిని కోరుతూ వచ్చాడు.గాయపడిన ఆ మహిళను భద్రతా దళాలు చికిత్స కోసం తరలించాయి. కాగా ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు ఈ చిన్నారుల దుస్థితిని చూసి చలించిపోయారు. దారి (ఆఫ్ఘన్) భాషలో ‘మదర్ గెటప్’ ఆమె హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ వచ్చింది. ఈ తల్లీ పిల్లల దుస్థితి చూసి హృదయం ద్రవించిపోతోందని ఓ ట్విటర్ యూజర్ పేర్కొన్నారు. కాగా రక్తమోడుతున్న దుస్తులతో కూర్చున్న ఆ ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అటు ఈ పేలుడుకు తమదే బాధ్యత అని ఏ సంస్ధ ప్రకటించలేదు.
తాలిబన్లు కూడా తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ :
అందంగా ఉందని యువతిని ఉద్యోగం నుంచి తొలగింపు : women dismissed from job due to her beauty video
దుబాయ్ పోలీస్ స్టేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు : Mahesh Babu in Dubai Smart police Station Video