
Ukraine Beautiful Places: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే యుద్ధంతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్.. నిజానికి ఎంతో అందమైన దేశం (Beautiful Area). భూతల స్వర్గాన్ని తలపించే ఈ దేశంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, ప్రాచీణ కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. ఉక్రెయిన్‌లోని ల్వివ్ నగరం అబ్బురపరిచే ఆర్కిటెక్చర్‌కు పెట్టింది పేరు. ఇక్కడ ఎన్నో ప్రాచీన కట్టడాలు ఉన్నాయి.

బకోటా: ఉక్రెయిన్‌లో బెస్ట్ క్యాంపిగ్ ప్రదేశంగా ఈ ప్రాంతంలో ఎంతో పేరొందింది. నది మధ్యలో ఐల్యాండ్స్, నదికి ఇరువైపులా ఉండే క్యాపింగ్ సైట్స్ ఉంటాయి.

కీవ్: సినిమా షూటింగ్‌లకు స్వర్గధామం అయిన ఉక్రెయిన్ రాజధాని కీవ్. ఇక్కడ ఎన్నో అందాలు దాగివున్నాయి. ఇక్కడ చూసే ప్రదేశాలు చాలా ఉంటాయి. పర్యటకులను ఈ కీవ్ అందాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

పింక్ లేక్: పింగ్ రంగులో కనిపించే ఈ లేక్ ఉక్రెయిన్‌లోని బ్యూటిఫుల్ పర్యటక ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడికి పర్యటకులు భారీగా వస్తుంటారు.

టన్నెల్ ఆఫ్ లవ్: ఇక్కడ రెండు వైపులా చెట్లతో అల్లుకున్నట్లు సొంగంలా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని టన్నెల్ ఆప్ లవ్ అని పేరుంది. ఇది చాలా సినిమాలలో కూడా కనిపిస్తుంటుంది. ఇక్కడికి వెళితే మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చూసేందుకు రెండు కళ్లు చాలవు.

వొరోక్తా: ఉక్రెయిన్‌లోని అందమైన గ్రామం ఇది. చుట్టు పచ్చిక బయళ్లు, ఎత్తైన కొండలతో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి అందాలను తిలకించేందుకు పర్యటకులు వస్తుంటారు.