Morocco Earthquake: ఎటు చూసిన శవాల దిబ్బలే.. మూడు వేలకు చేరువలో మొరాకో మృతుల సంఖ్య

|

Sep 12, 2023 | 11:14 AM

మొరాకోలో వచ్చిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అట్లాస్ పర్వతాల్లోని 6.8 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి వేలాది మంది చనిపోతున్నారు. ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం వల్ల నేలమట్టమయిన భవన శిథాలలను తొలిగిస్తు కొద్ది ఇంకా కుప్పలు కుప్పులుగా శవాలు బయటపడటం కలకలం రేపుతోంది. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 3 వేలకు చేరువైపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Morocco Earthquake: ఎటు చూసిన శవాల దిబ్బలే.. మూడు వేలకు చేరువలో మొరాకో మృతుల సంఖ్య
Morocco Earthquake
Follow us on

మొరాకోలో వచ్చిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అట్లాస్ పర్వతాల్లోని 6.8 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి వేలాది మంది చనిపోతున్నారు. ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం వల్ల నేలమట్టమయిన భవన శిథాలలను తొలిగిస్తు కొద్ది ఇంకా కుప్పలు కుప్పులుగా శవాలు బయటపడటం కలకలం రేపుతోంది. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 3 వేలకు చేరువైపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్థానిక అధికారులు వెల్లడించిన ప్రకారం.. ఇప్పటిదాకా 2,862 మంది మృతి చెందారు. అలాగే ఈ మహా విపత్తులో 2500ల మందిపైకి పైగా గాయాలపాలయ్యారు. అయితే వారిలో కొంతమంది పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఘటనాస్థలంలో ప్రస్తుతం 100 మందితో కూడిన మొరాకా రక్షణ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటోంది.

ఇదిలా ఉండగా మొరాకోలో భూకంపం వచ్చి ఇప్పటికీ 72 గంటలు దాటిపోయింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల చిక్కుకున్నటువంటి బాధితులు ప్రాణాలతో బయటకు వస్తారన్న ఆశలు సన్నగిల్లిపోవడం కంటతడిపెట్టిస్తున్నాయి. ముఖ్యంగా భూకంప కేంద్ర ప్రాంతమైనటువంటి అట్లాస్ పర్వత ప్రాంతంలోని మూరుమూలన ఉన్న గ్రామాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎక్కడ చూసిన కూడా గుట్టలుగుట్టలుగా శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వీటి ప్రభావంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీనివల్ల సహాయక బృందాలకు అక్కడికి చేరుకునేందుకు కూడా అనుకూలంగా లేని పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో శిథిలాల వెలికితీత పనులు ఇప్పటిదాకా చేపట్టలేదు. దీనివల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉండగా.. గత శుక్రవారం రోజున అర్ధరాత్రి సమయంలో మొరాకోలోని మర్రకేష్ అనే పర్యాటక ప్రాంతానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్లాస్ పర్వత ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఈ భూకంపం దాటికి ప్రభావితమై ఉంటారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అట్లాస్ పర్వతం ప్రాంతంలోని అల్ హౌజ్ ప్రావిన్స్‌‌లో ఎక్కువగా విధ్వంసం, మరణాలు జరిగాయి. ఇళ్లన్ని నేలమట్టం అయిపోయాయి. రహదారులను బండరాళ్లు కప్పేశాయి. దీనివల్ల స్థానికులే ఆ రాళ్లను తొలగించే ప్రయత్నాలు చేశారు. ఇక చివరికి సాయం చేసేందుకు సైనికులతో కూడిన ట్రక్కలు అమిజ్‌మిజ్ అనే పట్టణానికి చేరుకోవడంతో బాధితులు కాస్త ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా మరింత సాయం కావాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు మొరాకోకు సాయం చేసేందుకు యూఏఈ, ఖతర్ లాంటి పలు దేశాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.

ఇవి కూడా చదవండి