Nigeria: చర్చీ వేడుకలో తొక్కిసలాట.. 31 మంది మృతి.. ఆహారం పంపిణీ చేస్తుండగా..

|

May 29, 2022 | 8:59 AM

ఈ ప్రమాదంలో 31 మంది మరణించగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్టు రివర్స్ స్టేట్ పోలీసులు తెలిపారు.

Nigeria: చర్చీ వేడుకలో తొక్కిసలాట.. 31 మంది మృతి.. ఆహారం పంపిణీ చేస్తుండగా..
Nigeria
Follow us on

Nigeria church event : నైజీరియాలో దారుణం చోటుచేసుకుంది. ఓ చర్చ్ దగ్గర జరిగిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్కోర్ట్ నగరంలో జరిగింది. ఈ ప్రమాదంలో 31 మంది మరణించగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్టు రివర్స్ స్టేట్ పోలీసులు తెలిపారు. అయితే మరణించిన వారిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నార్నారు. శనివారం ఉదయంలో చర్చీలో బహుమతులతో ఆహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలామంది ఆహారం కోసం చర్చి దగ్గరకు చేరుకున్నారు. వందలాది మంది గేటు దగ్గరకు చేరి.. గేటును ధ్వంసం చేశారు. అనంతరం ఒక్కసారిగా లోపలికి ప్రవేశించారు. ఆ క్రమంలో తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు.

చర్యలు తీసుకున్నప్పటికీ చాలామంది వినకుండా లోపలికి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా పరుగులు తీయడంతో అది తొక్కిసలాటకు దారితీసిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నైజీరియా పోలీసులు తెలిపారు. చాలామందికి గాయాలయ్యాయని.. స్థానిక పోలీసు అధికారి గ్రేస్ ఇరింగే-కోకో వెల్లడించారు. పోర్ట్ హార్కోర్ట్ పోలో చర్చ్‌లో నిర్వహించిన ఫ్రీ ఛారిటీ ఈవెంట్‌లో పేదలకు ఆహారం, బహుమతులు అందజేస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..