Missing Indonesian Flight : సముద్రంలో కూలిపోయిన ఇండోనేషియా విమానం.. 59 మంది ప్రయాణిస్తున్నట్లు ధ్రువీకరణ..

Missing plane:ఇండోనేషియా గగనతలంలో విమానం మిస్సింగ్ అయింది. జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కమ్యూనికేషన్ ఆగిపోయింది.

Missing Indonesian Flight : సముద్రంలో కూలిపోయిన ఇండోనేషియా విమానం.. 59 మంది ప్రయాణిస్తున్నట్లు ధ్రువీకరణ..

Updated on: Jan 09, 2021 | 5:45 PM

Missing Indonesian Flight: ఇండోనేషియా గగనతలంలో మిస్సింగ్ అయిన ఎస్ జే 182 విమానం సముద్రంలో కూలిపోయిందని అధికారులు ధ్రువీకరించారు. విమానంలో 50 మంది ప్రయాణిస్తున్నట్లు ప్రకటించారు. జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కమ్యూనికేషన్ తెగిపోయింది. జకార్తా నుంచి విమానం పొంటియానక్ వెళుతుండగా ఈ ఘటన సంభవించింది. వీరిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటి వరకు తెలిసిన సమాచారం:

  1. ఈ విమానంలో ఐదుగురు పిల్లలు, ఒక బిడ్డతో సహా 59 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు ఇండోనేషియా అధికారులు ధ్రవీకరించారు
  2. విమానంలో ఇద్దరు పైలట్లు మరియు నలుగురు క్రాబిన్ సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది
  3. విమానం సూకర్నో-హట్టా విమానాశ్రయం నుంచి బయలుదేరింది
  4. ఇది పశ్చిమ కాలిమంటన్ ప్రావిన్షియల్ రాజధాని పొంటియానాక్ వైపు వెళుతోంది
  5. బోయింగ్ 737 రకానికి చెందిన విమానంగా గుర్తించారు
  6. విమానం ఒక నిమిషం లోపు 10,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తును కోల్పోయిందని అధికారులు వెల్లడించారు
  7. ఈ విమానంలో ఐదుగురు పిల్లలు, ఒక బిడ్డతో సహా 59 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుననారని తెలుస్తోంది.
  8. ప్రయాణికుల కు టుంబ సభ్యుల్లో నెలకొన్న ఆందోళన
  9. ప్రయాణికుల ఆచూకీ తెలపాలని అధికారులను కోరుతున్న కుటుంబ సభ్యులు