Missing Indonesian Flight: సముద్రంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. శరీర భాగాలు, విమాన శకలాలు, బట్టలు లభ్యం

Missing Indonesian Flight: ఇండోనేషియా గగనతలంలో మిస్సింగ్ అయిన ఎస్ జే 182 విమానం సముద్రంలో కూలిపోయిందని అధికారులు ధ్రువీకరించారు. అయితే జకార్తా నుంచి ...

Missing Indonesian Flight: సముద్రంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. శరీర భాగాలు, విమాన శకలాలు, బట్టలు లభ్యం

Edited By: Venkata Narayana

Updated on: Jan 10, 2021 | 9:02 AM

Missing Indonesian Flight: ఇండోనేషియా గగనతలంలో మిస్సింగ్ అయిన ఎస్ జే 182 విమానం సముద్రంలో కూలిపోయిందని అధికారులు ధ్రువీకరించారు. అయితే జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కమ్యూనికేషన్ తెగిపోయింది. జకార్తా నుంచి విమానం పొంటియానక్ వెళుతుండగా ఈ ఘటన సంభవించింది.

అయితే మిస్‌ అదృశ్యమైన విమానం సముద్రంలో కూలిపోయినట్లు అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. కూలిన సమయంలో పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ పేలిపోయిందని సముద్ర జాలర్లు చెబుతున్నారు. దీంతో సముద్రంలో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 8 బోట్లు, 4 యుద్ధ నౌకలు, సముద్ర గజ ఈగాళ్లతో నేవి సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఆపరేషన్‌లో బ్యాగులు, అత్యవసర ఎయిర్‌ నిచ్చెన, బట్టలు, శరీర భాగాలు, కొన్ని విమాన శకలాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. మిస్‌ అయిన ఫైట్‌కి సంబంధించినవేనని వారు అనుమానిస్తున్నారు.

సుకన్నొ హత్తా ఎయిర్‌పోర్టులో అత్యవసర కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలో ప్రయాణికుల బంధువుల రోధనలతో దద్దరిల్లిపోతోంది. ఈ ఘటనకు సంబంధించి అధికారులు వారి కుటుంబ సభ్యులకు తగిన సమాచారం అందజేస్తున్నారు. అయితే టేకాప్‌కు ముందు వర్షం కారణంగా ఈ విమానం అరగంట పాటు ఆలస్యంగా బయలుదేరినట్లు తెలుస్తోంది. టేకాప్‌ అయిన 4 నిమిషాల్లోనే రాడార్‌ నుంచి అదృశ్యమైనట్లు గుర్తించారు అధికారులు.

విమానం వెయ్యి అడుగుల ఎత్తు నుంచి సముద్రంలో కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విమానంలో ఉన్న 62 మంది కాగా, 56 మంది ప్రయాణికులలో 46 మంది పెద్దలు, ఏడుగురు పిల్లలు, ముగ్గురు పసి పిల్లలు, నలుగురు కేబిన్‌ క్రూ, ఇద్దరు ఫైలట్లు ఉన్నారు.

Missing Indonesian Flight : సముద్రంలో కూలిపోయిన ఇండోనేషియా విమానం.. 59 మంది ప్రయాణిస్తున్నట్లు ధ్రువీకరణ..