Missing Indonesian Flight : సముద్రంలో కూలిపోయిన ఇండోనేషియా విమానం.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న అధికారులు..

Missing Indonesian Flight : ఇండోనేషియాకు సంబంధించిన ఎయిర్‌ బోయింగ్‌ -737 శ్రీ విజయ విమానం సముద్రంలో కూలినట్లు అధికారులు వెల్లడించారు. జావా సముద్రంలో పడిపోయినట్లు

Missing Indonesian Flight : సముద్రంలో కూలిపోయిన ఇండోనేషియా విమానం..  రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న అధికారులు..

Updated on: Jan 09, 2021 | 5:59 PM

Missing Indonesian Flight : ఇండోనేషియాకు సంబంధించిన ఎయిర్‌ బోయింగ్‌ -737 శ్రీ విజయ విమానం సముద్రంలో కూలినట్లు అధికారులు వెల్లడించారు. జావా సముద్రంలో పడిపోయినట్లు గుర్తించారు. జకార్తా నుంచి టేకాఫ్ అయిన నాలుగు నిమిషాల తర్వాత విమానం సముద్రంలో కూలిపోయిందని తెలిపారు. దీంతో అధికారులు సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రాడార్ డేటాబాక్స్ ప్రకారం ఒక నిమిషం లోపు 10,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తును కోల్పోయిందని అధికారులు వెల్లడించారు. కూలిపోయిన విమానం నెంబర్ శ్రీ విజయ ఎస్ జె 182 గా చెబుతున్నారు. ఈ ఘటనపై నేషనల్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ, జాతీయ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ కమిటీ పరస్పర సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ విమానంలో 56మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తంగా 62మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు ఫోన్లు చేస్తూ తమవారి జాడ తెలపాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Missing Indonesian Flight : సముద్రంలో కూలిపోయిన ఇండోనేషియా విమానం.. 59 మంది ప్రయాణిస్తున్నట్లు ధ్రువీకరణ..