Miss Universe Singapore 2021: మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌గా తెలుగమ్మాయి.. నందిత బన్న.. ఆమెది ఎక్కడో తెలుసా..?

Miss Universe Singapore Nandita Banna: మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌ -2021 కిరీటాన్ని తెలుగమ్మాయి నందిత బన్న దక్కించుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నిర్వాహకులు ఈ ఫలితాలను

Miss Universe Singapore 2021: మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌గా తెలుగమ్మాయి.. నందిత బన్న.. ఆమెది ఎక్కడో తెలుసా..?
Nandita Banna

Edited By:

Updated on: Sep 18, 2021 | 8:52 AM

Miss Universe Singapore Nandita Banna: మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌ -2021 కిరీటాన్ని తెలుగమ్మాయి నందిత బన్న దక్కించుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నిర్వాహకులు ఈ ఫలితాలను వెల్లడించారు. 25 ఏళ్ల క్రితం నందిత కుటుంబం సింగపూర్‌లో స్థిరపడింది. నందిత తల్లిదండ్రులు గోవర్థన్‌, మాధురి. వారి స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా. శుక్రవారం.. నేషనల్ మ్యూజియం సింగపూర్‌లో మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 పోటీలు జరిగాయి. ఈ పోటిలో నందిత బన్న ఏడుగురు ఫైనలిస్టులతో పోటీ పడి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ప్రస్తుతం నందిత వయస్సు 21 సంవత్సరాలు. మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 గా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన నందిత బన్న ప్రస్తుతం సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో డిగ్రీ ఫైనలియర్‌ చేస్తుంది. కాగా.. నందిత బన్న డిసెంబర్ లో ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగే మిస్ యూనివర్స్ 2021 పోటిల్లో సింగపూర్‌ నుంచి ప్రాతినిధ్యం వహించనుంది.

Also Read:

Viral Video: 45 సెకన్లలో 15 బిల్డింగ్‌లు కూల్చివేత..! ఆకాశాన్నంటే భవనాలు చూస్తుండగానే.. షాకింగ్‌ వీడియో..

Kamala Harris: కమలా హారిస్‌ను చంపేందుకు 53వేల డాలర్ల ఒప్పందం.. కోర్టులో సంచలన విషయాలు వెల్లడించిన నిందితురాలు..