Miss Universe 2023: ప్రపంచ సుందరి పోటీలకు వయోపరిమితి రద్దు.. తొలిసారిగా అన్నివయసుల వారికికి మిస్ యూనివర్స్ బ్యూటీ కాంటెస్ట్

|

Sep 15, 2023 | 12:17 PM

ప్రతీయేట ప్రపంచ సుందరి అందాల పోటీలు జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొనే వారికి కొన్ని నియమనిబంధనలు ఉంటాయి. అయితే ఇటీవల మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనేవారి గరిష్ట వయోపరిమితిని తొలగించింది. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో 'టానర్ ఫ్లెచర్స్ బ్యూటీ పేజెంట్ షో' సందర్భంగా మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్‌ పలుమార్పులను ప్రకటించింది. 1952 నుంచి జరుగుతోన్న ఈ అందాల పోటీల్లో పాల్గొనే పోటీదారులకు గతంలో..

Miss Universe 2023: ప్రపంచ సుందరి పోటీలకు వయోపరిమితి రద్దు.. తొలిసారిగా అన్నివయసుల వారికికి మిస్ యూనివర్స్ బ్యూటీ కాంటెస్ట్
Miss Universe 2023
Follow us on

పట్నా, సెప్టెంబర్ 15: ప్రతీయేట ప్రపంచ సుందరి అందాల పోటీలు జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొనే వారికి కొన్ని నియమనిబంధనలు ఉంటాయి. అయితే ఇటీవల మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనేవారి గరిష్ట వయోపరిమితిని తొలగించింది. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ‘టానర్ ఫ్లెచర్స్ బ్యూటీ పేజెంట్ షో’ సందర్భంగా మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్‌ పలుమార్పులను ప్రకటించింది. 1952 నుంచి జరుగుతోన్న ఈ అందాల పోటీల్లో పాల్గొనే పోటీదారులకు గతంలో 28 ఏళ్ల వయోపరిమితి ఉండేది. దానిని ఆర్గనైజేషన్‌ తాజాగా రద్దు చేసింది.

తొలిసారి 29 ఏళ్ల ఆర్‌ బోన్నీ గాబ్రియెల్‌ విశ్వ సుందరి కిరీటాన్ని అధీష్టించి వరించింది. దీంతో మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని దక్కించుకున్న అతిపెద్ద వయస్కురాలిగా రికార్డు బ్రేక్‌ చేసినట్లైంది. అయితే ఈ పోటీల్లో పాల్గొనేవారికి కనీస వయసు ఇప్పటికీ కనీసం 18 సంవత్సరాలుగానే ఉంది. దీనిలో ఆర్గనైజేషన్‌ ఎటువంటి మార్పు తీసుకురాలేదు.

న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ప్రపంచ సుందరి బెన్నీ గాబ్రియెల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఒక మహిళ పోటీ పడి గెలుపొందడానికి వయస్సు ఎప్పటికీ అడ్డంకి కాదని పేర్కొంది. ఆమె యాటిట్యూడ్‌ను సంస్థ ప్రశంసించింది. గతేడాది మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్‌ని 20 డాలర్ల మిలియన్లకు కొనుగోలు చేసిన ట్రాన్స్‌జెండర్ వ్యవస్థాపకురాలు అన్నే జక్కాఫాంగ్ జక్రాజుతాటిప్ మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్‌ నిర్ణయాన్ని ప్రశంశించారు.జక్కాఫాంగ్ జక్రాజుతాటిప్.. నాయకత్వంలో వివాహిత, విడాకులు తీసుకున్న, గర్భిణీ అయిన మిస్ యూనివర్స్ పోటీదారులపై ఉన్న ఆంక్షలు తొలగించారు.

ఇవి కూడా చదవండి

మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ నెలకొల్పిన సరికొత్త బెంచ్‌మార్క్‌ వినూత్న కార్యక్రమాలకు మార్గదర్శకంగా నిలిచింది. మహిళా సాధికారత, అందానికి ఎటువంటి సరిహద్దులు, వయోపరిమితి ఉండదని ఆమె నొక్కి చెప్పారు. గత నెలలో జరిగిన మిస్ యూనివర్స్ గ్వాటెమాల 2023 పోటీకి అర్హత సాధించిన మొదటి తల్లిగా మిచెల్ కోన్ గుర్తింపు పొందింది. గత వారంలో జరిగిన గారెట్ మిస్ యూనివర్స్ నేపాల్ 2023 జేన్ దీపికా కిరీటం దక్కించుకున్న మొట్టమొదటి ప్లస్-సైజ్ మోడల్‌గా నిలిచింది.

22 ఏళ్ల జేన్ దీపికా గారెట్ వృత్తి రిత్యా న్యాయవాది. 20 మంది పోటీదారుల్లో విజేతగా నిలిచారు. బాడీ పాజిటివిటీలో ఆమె సాధించిన విజయం కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. ప్రమాణాలలో సౌందర్యం ఒక ప్రమాణం మాత్రమేనని, ప్రతి ఒక్క స్త్రీ కూడా తనలాగే అందంగా ఉంటుందని నేను నమ్ముతున్నానంటున్నారు. ఇక నవంబర్‌లో ఎల్ సాల్వడార్‌లో జరగబోయే మిస్ యూనివర్స్ పోటీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే ఈ ఈవెంట్ మునుపటి పోటీల కంటే భిన్నంగా ఉండబోతోంది. ఈ పోటీల్లో వివాహితులు, తల్లులు,18 ఏళ్లు పైబడిన అన్ని వయస్సుల పోటీదారులు పాల్గొననున్నారు. గతంలోనైతే 18 నుంచి 28 సంవత్సరాల మధ్య పిల్లలు లేని అవివాహిత యువతులు మాత్రమే మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో పాల్గొనడానికి అనుమతి ఉండేది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.