Joe Biden: మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా కొత్త అధ్యక్షుడు… కనీస వేతన పరిమితిని పెంచుతూ..

Minimum Wage Hike In USA: అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారీ సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌. ఓవైపు అమెరికన్ల...

Joe Biden: మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా కొత్త అధ్యక్షుడు... కనీస వేతన పరిమితిని పెంచుతూ..

Updated on: Feb 03, 2021 | 5:46 AM

Minimum Wage Hike In USA: అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారీ సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌. ఓవైపు అమెరికన్ల ప్రాధాన్యతలను కాపాడుతూనే మరోవైపు ఇతర దేశాల నుంచి వచ్చిన వలసదారులకు కూడా మేలు చేసేలా బైడెన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే అమెరికన్ల కోసం కరోనా రిలీఫ్‌ ప్యాకేజ్‌ ప్రకటించారు. అంతేకాకుండా హెచ్‌1బీ వీసాదారులకు, వలసదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. వీటితో పాటు హెచ్‌4 వీసా విషయంలో సడలింపులు ఇచ్చారు. దీనిద్వారా హెచ్‌1బీ వీసాదారుల భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించారు. ఇలా ట్రంప్‌ హయాంలో తీసుకున్న ఒక్కో వివాదాస్పద నిర్ణయాలను మారుస్తూ బైడెన్‌ సంస్కరణలకు తెర తీశారు. ఇదిలా ఉంటే తాజాగా జో బైడెన్‌ అమెరికన్లకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పారు. అమెరికన్ల కనీస వేతన పరిమితిని గంటకు 15 డాలర్లకు పెంచుతూ బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై సమావేశమైన సెనేట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బైడెన్‌ ట్విట్టర్‌ వేదికగా స్వయంగా తెలియజేశాడు. ఈ నిర్ణయంపై అమెరికన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: China Govt: వీగర్ తెగ పై చైనా ప్రభుత్వం దాష్టీకం.. తాజాగా మరో దారుణానికి ఒడిగట్టిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సర్కార్..