Mine Accident in China: చైనాలోని వాయువ్య ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రకృతి విలయానికి ఓ బొగ్గు గనిలో పనిచేస్తున్న 21 గల్లంతయ్యారు. చైనాలోని జిన్జియాంగ్ బొగ్గుగనిలో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చైనాలోని వాయవ్య ప్రాంతం.. జిన్జియాంగ్ ఉయ్‌గుర్ అటానమస్ రీజియన్‌లో శనివారం అకస్మాత్తుగా భారీ వరదలు సంభవించాయి. దీంతో చాంగ్జీ హుయ్ అటానమస్ ప్రిఫెక్చర్‌లోని హుతుబి కౌంటీలో ఉన్న బొగ్గుగనిలోకి భారీగా వరద నీరు ప్రవేశించింది.
అయితే ఆ సమయంలో గనిలో 29 మంది మైనర్లు పనిచేస్తున్నారని చైనా డైలీ వెల్లడించింది. వెంటనే రంగంలోకి దిగిన విపత్తు అధికారులు.. ఇప్పటివరకు ఎనిమిది మందిని మాత్రమే రక్షించారని పేర్కొంది. మరో 21 మంది మైనర్ల ఆచూకీ తెలియడం లేదని వెల్లడించింది. కనిపించకుండా పోయిన వారికోసం గాలింపు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని చైనా డైలీ వివరించింది. కాగా.. బోగ్గు గని భూమి పైనుంచి దాదాపు 1200 మీటర్ల లోతులో ఉంటుంది. అక్కడ మైనర్లు పనిచేస్తున్నారు. దీంతో రెస్క్యూ నిర్వహణ కష్టంగా మారింది. మోటర్ల ద్వారా వరద నీటిని బయటకు పంపుతున్నారు.
కాగా.. చైనాలో మైనింగ్ ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. భద్రతా పరంగా.. నిబంధనలు బలహీనంగా ఉండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. జనవరిలో తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని ఒక గనిలో 22 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 11 మందిని రక్షించగా.. 10 మంది మరణించారు. ఇంకొకరి జాడ తేలియలేదు. డిసెంబరులో కూడా భూగర్భంలో చిక్కుకొని 23 మంది మైనర్లు మరణించారు.
Also Read: