Mehul Choksi: మెహుల్‌ చోక్సీకి నో బెయిల్‌.. విచారణను వాయిదా వేసిన డొమినికా కోర్టు..

|

Jun 09, 2021 | 10:29 AM

Mehul Choksi's bail: పంజాబ్‌ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ బెయిల్‌ విచారణను డొమినికా హైకోర్టు

Mehul Choksi: మెహుల్‌ చోక్సీకి నో బెయిల్‌.. విచారణను వాయిదా వేసిన డొమినికా కోర్టు..
Mehul Choksi
Follow us on

Mehul Choksi’s bail: పంజాబ్‌ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ బెయిల్‌ విచారణను డొమినికా హైకోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. అక్రమంగా డొమినికాలోకి ప్రవేశించారన్న ఆరోపణలపై ఇటీవల ఆ దేశ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన డొమినికాలోని స్థానిక మెజిస్ట్రేట్‌ కోర్టులో ఆయన బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. దానిని తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. చోక్సీ న్యాయవాదుల బృందం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట వాదనలు వినిపించింది. ఈ క్రమంలో డొమినికా ప్రభుత్వం తరఫున న్యాయవాది బెయిల్‌ ఇవ్వొద్దని, ఇంకా విచారించాల్సి ఉందని వాదించారు. ఈ మేరకు హైకోర్టు విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.

దీంతో మెహుల్ చోక్సీ బృందం దాఖలు చేసిన హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై సైతం విచారణ వాయిదా పడింది. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ కుంభ‌కోణంలో నిందితుడైన మెహుల్‌ చోక్సీ 2018లో అంటిగ్వా పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్న చోక్సీ.. గత నెల మే 23న అదృశ్యమయ్యారు. అనంతరం డొమినికా ద్వీపంలో అనుమానాస్పదంగా కనిపించగా.. పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అంటిగ్వాలోని జాలీ హార్బర్‌ నుంచి తనను కిడ్నాప్‌ చేసి పడవలో డొమినికాకు తీసుకువచ్చారని ఆయన న్యాయవాదులు ఆరోపించారు. హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వాదలు విన్న హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు చోక్సీని రోజౌ మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశ పెట్టగా బెయిల్‌ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే పీఎన్‌బీ కేసులో నీరవ్ మోదీ సైతం బ్రిటన్ పారిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరినీ దేశానికి తీసుకొచ్చేందుకు సీబీఐ, ఈడీ ప్రయత్నిస్తున్నాయి.

Also Read:

Girl Died: ఘోరం.. తాగునీరు దొరక్క చిన్నారి మృతి.. స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలు.. కంటతడి పెట్టిస్తున్న ఘటన

Rare 1 Rupee Coin: ఈ 103 ఏళ్ల నాటి రూ. 1 నాణెంతో.. రూ. 5 లక్షలు సంపాదించవచ్చు.! ఎలాగంటే.?