మర్యమ్ నవాజ్ అరెస్ట్

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె , పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేత మర్యమ్  నవాజ్ అరెస్ట్ అయ్యారు.  నేషనల్ అక్కౌంటబులిటీ బ్యూరో (ఎన్ఏబీ) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్‌లో చౌదురీ షుగర్ మిల్స్ కేసులో మర్యమ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఎన్‌ఏబీ కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె పట్టించుకోలేదు. లాహోర్ కోట్ ల‌క్‌పాట్   జైల్లో ఉన్న ఆమె తండ్రి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిసేందుకు ఆమె గురువారం […]

మర్యమ్ నవాజ్  అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2019 | 2:56 PM

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె , పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేత మర్యమ్  నవాజ్ అరెస్ట్ అయ్యారు.  నేషనల్ అక్కౌంటబులిటీ బ్యూరో (ఎన్ఏబీ) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

పాకిస్తాన్‌లో చౌదురీ షుగర్ మిల్స్ కేసులో మర్యమ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఎన్‌ఏబీ కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె పట్టించుకోలేదు. లాహోర్ కోట్ ల‌క్‌పాట్   జైల్లో ఉన్న ఆమె తండ్రి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిసేందుకు ఆమె గురువారం వచ్చారు. దీంతో సమాచారం అందుకున్న అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

మర్యమ్ నవాజ్ సహా ఆమె కుటుంబం పెద్ద మొత్తంలో లాభం పొందారని ఎన్ఏబీ ఆరోపిస్తుంది. ఎన్ఏబీ అదుపులో ఉన్న మర్యమ్‌ను ఛౌదురి షుగర్ మిల్స్‌కు సంబంధించి పెద్ద షేర్‌హోల్డర్‌గా ఎలా అయ్యారనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా సమకూరాయనే విషయాలను కూడా రాబడుతున్నారు. వీటితో పాటు వివాదాస్పదంగా మారిన లావాదేవీలపై మర్యమ్‌ను విచారిస్తున్నారు.