Maori MP Rawiri Ejected: ప్రజలకొరకు , ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ నేతలు చట్ట సభల్లోకి అడుగు పెట్టి.. తర్వాత వారు ప్రవర్తించే తీరును మనం చూస్తూనే ఉన్నాం. మనదేశమనే కాదు ఏ దేశమైన రాజకీయ నేతలు పదవిని అలంకరించిన తర్వాత కోపం వస్తే.. నిరసన తెలియజేయడానికి పోడియం వద్దకు వెళ్లి నానా బీభత్సాన్ని సృస్తిస్తున్నారు. ఇక పేపర్లు విసిరేసి వారితో పాటు.. మరికొన్ని చోట్ల మైకులు విరిచేసి కుర్చీలతో కొట్టుకోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అటువంటి వారిని వెంటనే చట్ట సభనుంచి బయటకు పంపిస్తారు.. అయితే డ్రెస్సింగ్ సరిగ్గా లేదని టై కట్టుకోలేదని సభ నుంచి బయటకు పంపించడం ఎప్పుడైనా విన్నారా..! చూశారా..! తాజాగా ఇటువంటి సంఘటన న్యూజిలాండ్ పార్లమెంట్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
న్యూజిలాండ్ కు చెందిన రివైరీ వైటిటి అనే మేజర్ పార్టీకి చెందిన ఎంపి సభలో చర్చ జరిగే సమయంలో ఓ ప్రశ్నను అడిగేందుకు ప్రయత్నించాడు. అలా రెండు సార్లు ప్రయత్నించగా, మీకు సభలో మాట్లాడే హక్కు లేదని, పార్లమెంట్ నిబంధనలు విరుద్ధంగా టై కట్టుకోకుండా వచ్చారని సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ ఆదేశించారు. దీంతో సభలోని సభ్యులు షాక్ అయ్యారు. స్పీకర్ అదేయించిన తరువాత సభలో ఉండటం పార్లమెంట్ కు విరుద్ధం కాబట్టి సభ నుంచి ఎంపి బయటకు వచ్చేశారు.
Also Read: