బ్రెయిన్‌ డెడ్‌ అంటూ డాక్టర్ల నిర్ధారణ.. కాళ్లు కదపడంతో అంతా షాక్‌.. సిటీ స్కానింగ్‌లో ఏం తేలిందంటే?

|

Sep 07, 2022 | 1:54 PM

America: అమెరికా నార్త్ కరోలినాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఓ వ్యక్తి ఆశ్చర్యకర రీతిలో కాళ్లు కదిపాడు. దీంతో వైద్యులు మారోమారు పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచుశాయి.

బ్రెయిన్‌ డెడ్‌ అంటూ డాక్టర్ల నిర్ధారణ.. కాళ్లు కదపడంతో అంతా షాక్‌.. సిటీ స్కానింగ్‌లో ఏం తేలిందంటే?
Follow us on

America: అమెరికా నార్త్ కరోలినాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఓ వ్యక్తి ఆశ్చర్యకర రీతిలో కాళ్లు కదిపాడు. దీంతో వైద్యులు మారోమారు పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచుశాయి. అతని బ్రెయిన్ యాక్టివ్ గానే ఉన్నట్లు తెలిసి వైద్యులు నమ్మలేకపోయారు. వెంటనే అతనికి మళ్లీ చికిత్స ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే ర్యాన్ మార్లో పాస్టర్‌గా పని చేస్తున్నాడు. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌తో వచ్చే అరుదైన లిస్టేరియా వ్యాధి బారినపడ్డాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు రెండు వారాల పాటు చికిత్స అందించారు. అనంతరం ఇన్‌ఫెక్షన్‌ వల్ల అతని మెదుడులో వాపు వచ్చిందని, బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు ప్రకటించారు.

కాగా తాను అవయవ దానం చేస్తానని ర్యానో గతంలోనే నమోదు చేసుకున్నాడు. దీంతో అతన్ని లైఫ్‌ సపోర్టుపై ఉంచారు వైద్యులు. అతని అవయవాలు పొందేందుకు సరైన రోగుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఆగస్టు 30న ర్యాన్‌కు అంతిమ వీడ్కోలు చెప్పేందుకు అందరూ సిద్ధమవుతుండగా.. మేగన్‌ కోడలు ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. ర్యాన్ కాళ్లు కదిపారని, అది ఫోన్లో తీసిన వీడియోలో రికార్డయ్యిందని చెప్పింది. అనంతరం సీటీ స్కాన్ తీసిన వైద్యులు అవాక్కయ్యారు. ర్యాన్ బ్రెయిన్ యాక్టివ్‌లోనే ఉన్నట్లు అందులో తేలింది. దీంతో పొరపాటుగా వాళ్లు బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించినట్లు స్పష్టమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..