Malala Yousafzai on Afghanistan Taliban: ఆఫ్ఘానిస్థాన్‌ను తాలిబాన్లు వశపరుచుకోవడంతో ఆ దేశంలో అంతటా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌ను తాలిబాన్లు వశపరుచుకోవడంతో.. మొత్తం భూభాగం వారి వశమైంది. దీంతో ఆఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేసి.. దేశం విడిచి వెళ్లారు. ఆయన తజకిస్తాన్ వెళ్లినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా.. తాలిబాన్ల రాకతో మహిళలు, బాలికలు ఆందోళన చెందతున్నారు. తాము మళ్లీ అరచకాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే తాలిబన్లు బాలికలను పాఠశాలలకు పంపవద్దని, తాలిబాన్లకు ఇచ్చి పెళ్లి చేయాలంటూ హుకూం జారీ చేశారు. ఈ క్రమంలో మహిళలు, బాలికలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇతర దేశాల వైపు పరుగులు తీస్తు్న్నారు.
ఈ నేపథ్యంలో మహిళల భవిష్యత్తుపై విద్యాహక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి మహిళలు, మైనారిటీలు, మానవహక్కుల కార్యకర్తల విషయంలో తాను తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘానిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లడం చూసి ఒక్కసారే నిర్ఘాంతపోయానంటూ ఆమె కామెంట్ చేశారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణకు పిలుపుఇవ్వాలంటూ కోరారు. దీంతోపాటు ఆఫ్ఘాన్ ప్రజలకు అత్యవసర మానవతా సహాయం అందించాలని.. శరాణార్థులను రక్షించాలని కోరారు.
కాగా.. తాలిబన్ ప్రతినిధి ఎహ్‌షానుల్లా ఎహ్సాన్ 2012లో మలాలాపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. బాలికల విద్యాహక్కు కోసం పోరాడుతున్న ఆమెకు గుణపాఠం నేర్పించేందుకు నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అదృష్టవశాత్తూ..ఈ ఘటన నుంచి పూర్తిగా కోలుకున్న మలాలా.. ప్రస్తుతం మహిళల విద్యాహక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె నోబెల్ బహుమతి కూడా అందుకున్నారు.
Also Read: