Internet Down: కొన్ని గంటల పాటు ఇంటర్‌నెట్ ఆగిపోతే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి.. అదే జరిగింది గమనించారా..!

|

Jun 17, 2021 | 6:20 PM

Internet Down:

Internet Down: కొన్ని గంటల పాటు ఇంటర్‌నెట్ ఆగిపోతే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి.. అదే జరిగింది గమనించారా..!
Internet Down
Follow us on

ఇంటర్నెట్ కొన్ని గంటల పాటు ఆగిపోతే ఏం జరుగుతుంది.. ఊహించుకోవడమే చాలా కష్టం.. మనిషికి ప్రాణ వాయువు.. ఆక్సిజన్ ఎంత అవసరమో.. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా అంతే స్థాయిలో అవసరం.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్(Internet outage)​ కొద్ది సమయం పాటు నిలిచిపోయింది. ఫలితంగా పలు ఆర్థిక సంస్థల వెబ్​సైట్లు, యాప్​లు ఆగిపోయాయి. ఎయిర్​లైన్లు, ఇతర కంపెనీలపైనా ఈ ప్రభావం భారీగా పడింది. ఇంటర్నెట్ మానిటరింగ్ వెబ్​సైట్లు అయిన థౌజండ్​ఐస్, డౌన్​డిటెక్టర్ వంటి మాధ్యమాలు పలుమార్లు నిలిచిపోయాయి.

హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీ తన ట్విట్టర్ మాధ్యమం ఈ సంగతిని వెల్లడించింది. 17 నిమిషాల పాటు తమ వ్యవస్థ పనిచేయలేదంటూ తెలిపింది. ఆస్ట్రేలియాలో బ్యాంకింగ్, విమాన బుకింగ్, పోస్టల్ సేవల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంటర్నెట్ నిలిపోవడంతో వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆ దేశ తపాలా సేవల సంస్థ ఆస్ట్రేలియా పోస్ట్ పేర్కొంది. అనంతరం సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. సమస్యను పరిశీలిస్తున్నట్లు వివరించింది. రిజర్వ్ బ్యాంక్ సైతం..వీటితో పాటు అనేక ఇతర సేవలు గంట పాటు నిలిచిపోయి..

మళ్లీ ప్రారంభమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా సహా కామన్​వెల్త్, ఏఎన్​జడ్, సెయింట్ జార్జ్, వెస్ట్​పాక్ వంటి బ్యాంకింగ్ సంస్థలన్నీ ఈ  సమస్యనె ఎదుర్కొన్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఈ సంస్థల వెబ్​సైట్​లన్నీ దాదాపుగా సాధారణ స్థితికి చేరుకున్నాయి.

కారణం ఒక్కటే ఇంటర్నెట్ సేవల సంస్థ  ‘అకమై’కు చెందిన వ్యవస్థలో సమస్య వల్ల తమ సేవలకు అంతరాయం కలిగిందని ప్రముఖ విమానయాన సంస్థ వర్జిన్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ప్రపంచంలోని అనేక బడా సంస్థలు, బ్యాంకులకు అకమై సంస్థ.. అంతర్జాల సేవలు అందిస్తోంది. ఈ విషయంపై సంస్థ వివరణ కోరేందుకు ఫోన్​ చేసినప్పటికీ.. అకమై స్పందించలేదు.మొన్ననే ఓసారి.. కొద్దిరోజుల క్రితమే అంతర్జాలం నిలిచిపోయి అనేక బడా సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి : AP Exams: ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ.. ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్..

ఏటీఎంలో దొంగలు పడ్డారు.. సీసీ కెమెరాను పగలగొట్టారు.. ఇక అంతా ఓకే అనుకుంటే..ఆ గదిలో ఓ మూల వణుకు పుట్టించింది..