భూకంపంతో వణికిన పపువా న్యూ గినియా..

పపువా న్యూ గినియా దేశాన్ని భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 7.2గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున బులాలో నగరానికి 33 కిలోమీటర్లు, రాజధాని పోర్ట్ మోర్స్ బైకి 127 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంప ప్రభావంతో సునామీ వచ్చే అవకాశాలు లేవని పసిఫిక్ వార్నింగ్ సెంటర్ తెలిపింది. పపువా న్యూ గినియాలో సోమవారమే 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. మళ్లీ […]

భూకంపంతో వణికిన పపువా న్యూ గినియా..

Edited By:

Updated on: May 07, 2019 | 12:46 PM

పపువా న్యూ గినియా దేశాన్ని భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 7.2గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున బులాలో నగరానికి 33 కిలోమీటర్లు, రాజధాని పోర్ట్ మోర్స్ బైకి 127 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంప ప్రభావంతో సునామీ వచ్చే అవకాశాలు లేవని పసిఫిక్ వార్నింగ్ సెంటర్ తెలిపింది.

పపువా న్యూ గినియాలో సోమవారమే 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. మళ్లీ 24 గంటలు గడవకముందే భారీ తీవ్రతతో భూకంపం వచ్చింది. గతేడాది ఫిబ్రవరిలో పపువా న్యూ గనియాలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించగా.. ఆ ప్రకృతి వైపరీత్యంలో దాదాపు 125 మంది చనిపోయారు.