- Telugu News World Long nose: Know who Has Longest Nose In world you will be shocked after see his nose know about this name
Longest Nose: ప్రపంచంలో అత్యంత పొడవైన ముక్కు ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..? గిన్నిస్ బుక్‌లో రికార్డు..!
Long Nose: ప్రతి మనిషిలో కనిపించేవి ముఖం, ముక్కు, చేవి తదితర అవయవాలు. కొందరికి ముక్కు పొడవుగా ఉంటే మంచిదంటుంటారు. ప్రపంచంలో అతి పొడవైన వ్యక్తులు ఉన్నట్లుగానే ..
Updated on: Dec 21, 2021 | 7:17 AM

Longest Nose: ప్రతి మనిషిలో కనిపించేవి ముఖం, ముక్కు, చేవి తదితర అవయవాలు. కొందరికి ముక్కు పొడవుగా ఉంటే మంచిదంటుంటారు. ప్రపంచంలో అతి పొడవైన వ్యక్తులు ఉన్నట్లుగానే అతి పొడవు ముక్కున్న వ్యక్తి కూడా ఉన్నాడు. అలాంటి వ్యక్తి పేరు ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డులో పేరు నమోదైంది.

అతని ముక్కు ఎంత పొడవుగా ఉందే తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో అతి పొడవు ముక్కున్న వ్యక్తి టర్కీలో ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు మెహ్మెట్ ఓజియురెక్. ఇతనికి పొడవైన ముక్కు ఉన్నందున గిన్నిస్‌బుక్ రికార్డు సాధించాడు.

ప్రపంచంలో ఇతని ముక్కు చాలా పొడవు ఉందని, అందుకే ఇతని పేరు గిన్నిస్ బుక్‌లో నమోద చేశామని గిన్నిస్‌బుక్ రికార్డ్స్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇతని ముక్క పొడవు 8.8 సెం.మీ (3.46 అంగుళాలు). 2010లో ఇటలీలో జరిగిన ఓ టీవీ షోలో అతని గురించి తెలుసుకున్నామని, ఇంత పొడవైన ముక్కున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయి ఆయన పేరును గిన్నిస్‌బుక్‌లో చేర్చామని వెబ్‌సైట్ ద్వారా తెలిపింది.

పొడవాటి ముక్కున్న మెహ్మెట్ ఓజియురెక్ మాట్లాడుతూ.. నేను నా ముక్కు పొడవు ఉండటం వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. నా ముక్కు పొడవు ఉండటం వల్ల గిన్నిస్‌బుక్‌లో రికార్డు అయ్యింది. నేను ఎక్కడికెళ్లినా నా ముక్కు గురించే మాట్లాడుకుంటున్నారు. నా ముక్కును చూసి ఎంతో మంది గుర్తిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.





























