లిబియా సముద్రతీరంలో నౌక బోల్తా.. 150 మంది గల్లంతు!

| Edited By:

Jul 26, 2019 | 3:17 AM

లిబియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యధరా సముద్రంలో వలసదారులతో వెళ్తున్న నౌక బోల్తాపడటంతో 150 మంది పైగా గల్లంతయ్యారు. వీరంతా చనిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలియగానే నౌకదళం అక్కడికి చేరుకుంది. మునిగిపోతున్న నౌక నుంచి 125 మందిని రక్షించారు. గల్లంతైనవారి కోసం నౌకాదళం హెలికాప్టర్లు, బోట్లలో గాలిస్తున్నారు. క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనలో 150 మంది మరణించినట్లయితే.. మధ్యధరా సముద్రంలో జరిగిన ప్రమాదాల్లో అత్యంత ఘోరమైన విషాదం ఇదే అవుతుంది. ఈ […]

లిబియా సముద్రతీరంలో నౌక బోల్తా.. 150 మంది గల్లంతు!
Follow us on

లిబియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యధరా సముద్రంలో వలసదారులతో వెళ్తున్న నౌక బోల్తాపడటంతో 150 మంది పైగా గల్లంతయ్యారు. వీరంతా చనిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలియగానే నౌకదళం అక్కడికి చేరుకుంది. మునిగిపోతున్న నౌక నుంచి 125 మందిని రక్షించారు. గల్లంతైనవారి కోసం నౌకాదళం హెలికాప్టర్లు, బోట్లలో గాలిస్తున్నారు. క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనలో 150 మంది మరణించినట్లయితే.. మధ్యధరా సముద్రంలో జరిగిన ప్రమాదాల్లో అత్యంత ఘోరమైన విషాదం ఇదే అవుతుంది. ఈ ఏడాది మే నెలలో కూడా ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. లిబియా నుంచి యూరప్‌కు బయల్దేరిన వలసదారుల నౌక ఒకటి బోల్తాపడింది. ఈ ఘటనలో 70 మంది దుర్మరణం చెందారు.