వెనుజులా ప్రతిపక్షనేత అరెస్ట్.. కారులో నుంచే కిడ్నాప్

| Edited By:

May 09, 2019 | 5:14 PM

వెనుజులా ప్రతిపక్షనేత ఎడ్గర్ జాంబ్రానోను ఆ దేశ ఇంటిలిజెన్స్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. కారులో నుంచి దిగేందుకు ఆయన నిరాకరించడంతో.. వాహనంలో ఆయన ఉండగానే, కారుతో సహా లాక్కుపోయారు. అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించేందుకు ఎడ్గర్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవనెత్తిన నేపథ్యంలో.. వెనుజులాలో హింసాకాండ చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు మదురో సైనిక చర్యకు పూనుకున్న నేపథ్యంలో ఎడ్గర్ అరెస్ట్ పరిస్థితిని మరింత విషమింప చేసేదిగా ఉంది. అటు ఎడ్గర్ అరెస్ట్‌ను […]

వెనుజులా ప్రతిపక్షనేత అరెస్ట్.. కారులో నుంచే కిడ్నాప్
Follow us on

వెనుజులా ప్రతిపక్షనేత ఎడ్గర్ జాంబ్రానోను ఆ దేశ ఇంటిలిజెన్స్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. కారులో నుంచి దిగేందుకు ఆయన నిరాకరించడంతో.. వాహనంలో ఆయన ఉండగానే, కారుతో సహా లాక్కుపోయారు. అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించేందుకు ఎడ్గర్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవనెత్తిన నేపథ్యంలో.. వెనుజులాలో హింసాకాండ చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు మదురో సైనిక చర్యకు పూనుకున్న నేపథ్యంలో ఎడ్గర్ అరెస్ట్ పరిస్థితిని మరింత విషమింప చేసేదిగా ఉంది. అటు ఎడ్గర్ అరెస్ట్‌ను ఖండించిన అమెరికా.. అతడిని వెంటనే విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవల్సి ఉంటుందని వెనుజులా ప్రభుత్వాన్ని హెచ్చరించింది.