Joe Biden Cancer : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్‌..! నెట్టింట వార్త వైరల్‌.. క్లారిటీ ఇచ్చిన వైట్‌ హౌస్

|

Jul 21, 2022 | 8:07 PM

పలు దేశాల్లో పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలు, వాటివల్లచోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులపై మాట్లాడుతూ బైడెన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. అగ్రరాజ్య అధ్యక్షుడు చేసిన ఆ వ్యాఖ్యలు..

Joe Biden Cancer : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్‌..! నెట్టింట వార్త వైరల్‌..  క్లారిటీ ఇచ్చిన వైట్‌ హౌస్
Joe Biden
Follow us on

Joe Biden Cancer : అమెరికా అధ్యక్షుడు ఓ సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలు, వాటివల్లచోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులపై మాట్లాడుతూ బైడెన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఆగ్రరాజ్య అధ్యక్షుడు చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికాతో పాటు పలుదేశాల్లో బైడెన్‌ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. గ్లోబల్ వార్మింగ్‌పై ప్రసంగంలో తనకు క్యాన్సర్ ఉన్నట్లు ప్రకటించారు జో బైడెన్‌.. ఇది కాస్తా వైరల్‌గా మారింది. అమెరికా అధ్యక్షుడికి క్యాన్సర్ వచ్చిదంటూ వివిధ దేశాల్లో పలువురు నేతలు చర్చించుకోవడం మొదలుపెట్టారు. అమెరికాలోనూ అధ్యక్షుడి ఆరోగ్యంపై ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే, వెంటనే వైట్ హౌస్ కార్యాలయం వివరణ ఇచ్చింది.

బైడెన్ గతంలో తీసుకున్న చర్మ క్యాన్సర్ చికిత్స గురించి ప్రస్తావించినట్లు వైట్‌ హౌజ్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొంది. గ్లోబల్ వార్మింగ్, పొరుగు ప్రాంతమైన డెలావేర్‌లోని క్లేమాంట్ సమీపంలోని చమురు శుద్ధి కర్మాగారాల నుండి వెలువడే ఉద్గారాలపై ఆయనపై ప్రసంగించారు. ‘మా తల్లి మమ్మల్ని చాలా కష్టంగా పెంచింది. ప్రస్తుతం ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఆయిల్ స్లిక్‌ను కిటికీ నుంచి తీసేయడానికి విండ్ షీల్డ్ వైపర్లను ధరించాలి. నాతో పెరిగిన చాలా మందికి క్యాన్సర్ ఉంది. డెలావర్‌లో అత్యధిక క్యాన్సర్ రేటు ఉంది’ అని మసాచుసెట్స్‌లోని మాజీ బొగ్గు గని ప్లాంట్‌ను సందర్శించిన సందర్భంగా బైడెన్ చెప్పారు. కాగా, తనకు క్యాన్సర్ ఉందని బైడన్ చెప్పడంపై ట్విట్టర్‌లో అనేకమంది స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అయితే ఆయన గతంలో చికిత్స తీసుకున్నారని వైట్ హౌట్ క్లారిటీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి