ఇజ్రాయిల్, హమాస్ ల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాల్లోని ప్రజలు వందలాది మంది మరణిస్తున్నారు. వేలాదిమంది గాయపడుతున్నారు. పరిస్థితి దారుణంగా ఉండడంతో భారతదేశం ఇజ్రాయిల్ నుండి భారతీయులను తిరిగి తీసుకువస్తుంది. ఇందుకోసం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభిస్తున్నట్లు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపారు. పౌరులను తిరిగి తీసుకురావడానికి చార్టర్ విమానాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
ఇజ్రాయిల్, హమాస్ మధ్య వరుసగా ఐదు రోజులుగా యుద్ధం జరుగుతోంది. గాజా వేదికగా హమాస్ యోధులు ఇజ్రాయిల్‌పై తీవ్ర దాడులు చేస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయిల్ ప్రతీకారం తీర్చుకుంటూ.. పాలస్తీనాపై నిరంతరం దాడులు చేస్తోంది. గాజాపై వైమానిక దాడితో పాటు, ఇజ్రాయెల్ సైన్యం కూడా గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇజ్రాయిల్ సైనికులు గాజా సరిహద్దులోకి ప్రవేశించారు. అటువంటి పరిస్థితిలో యుద్ధం చాలా రోజులు కొనసాగవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇజ్రాయిల్ నుండి తిరిగి రావాలనుకునే భారతీయులు తిరిగి మన దేశం వచ్చేందుకు వీలుగా ఆపరేషన్ అజయ్‌ని ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రత్యేక విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలలో ఉన్న మన జాతీయుల భద్రత , శ్రేయస్సుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జై శంకర్ చెప్పారు.
Spoke to Foreign Minister @ABZayed of UAE this evening.
Discussed the ongoing crisis in West Asia. Agreed to stay in touch.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 11, 2023
ఆపరేషన్ అజయ్‌ను ప్రకటించే ముందు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యుఎఇ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరుదేశాల నేతలు పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభంపై చర్చించారు. జైశంకర్ తన యుఎఇ కౌంటర్‌తో ఫోన్‌లో ఈ సంభాషణ చేశారు. విశేషమేమిటంటే ఇజ్రాయిల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత భారత్‌తో చర్చలు జరిపిన తొలి అరబ్ దేశం యూఏఈ.
Launching #OperationAjay to facilitate the return from Israel of our citizens who wish to return.
Special charter flights and other arrangements being put in place.
Fully committed to the safety and well-being of our nationals abroad.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 11, 2023
ఒక నివేదిక ప్రకారం ఇజ్రాయిల్‌లో సుమారు 18 వేల మంది భారతీయ పౌరులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది అక్కడ పనిచేస్తున్న వారు.. అదే సమయంలో ఇజ్రాయిల్ లో భారీ సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. భారతదేశం తన పౌరులందరినీ ఇజ్రాయిల్ నుండి సురక్షితంగా తిరిగి తీసుకువస్తుందని, ఇందుకోసం చార్టర్ విమానాల ద్వారా ఏర్పాట్లు చేస్తామని విదేశాంగ మంత్రి ప్రకటించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..