హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై హఠాత్తుగా దాడి చేసి నరమేథం సృష్టించి కొంతమంది ఇజ్రాయెలీలను బందీలుగా తీసుకుని వెళ్లారు. తమపై హమాస్ యోధులు చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. గత నెల రోజులకు పైగా సాగుతున్న యుద్ధంలో ఇరు దేశాలనుంచి భారీగా జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే గాజాలో ఆస్పత్రులను, పాఠశాలను ఉగ్రవాదులు స్థావరాలుగా మలచుకున్నారని యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రపంచానికి చెబుతూనే ఉంది. అందుకు సాక్ష్యం ఇదిగో అంటూ తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) సోమవారం ఒక CCTV ఫుటేజీని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. ఈ వీడియో గాజాలోని అల్-షిఫా హాస్పిటల్‌ను హమాస్ ఉగ్రవాదులు అడ్డాగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ చేస్తోన్న వాదనకు మరింత బలం చేరికూర్చినట్లు అయింది. ఈ ఫొటోల్లో ఇజ్రాయెలీ బందీలుగా ఉన్న విషయాన్నీ చూపిస్తోంది. హమాస్ అల్-షిఫా ఆసుపత్రిని ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలుగా ఉపయోగించుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీ రుజువు చేసిందని ఐడీఎఫ్ పేర్కొంది.
These findings prove that the Hamas terrorist organization used the Shifa Hospital complex on the day of the October 7 Massacre as terrorist infrastructure. 2/2 pic.twitter.com/2UzlpKrNnv
ఇవి కూడా చదవండి— Israel Defense Forces (@IDF) November 19, 2023
IDF షేర్ చేసిన ఫుటేజీ అక్టోబరు 7న ఉదయం 10.42 నుంచి 11 గంటల మధ్య అల్-షిఫా ఆస్పత్రి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో హమాస్ ఉగ్రవాదులు చేతిలో ఆయుధాలు పట్టుకుని.. ఒక వ్యక్తిని ఆసుపత్రి ఏర్పాటును పోలి ఉన్న భవనం వద్దకు తీసుకుని వెళ్తున్నారు. అప్పుడు బందీగా ఉన్న ఆ వ్యక్తి సాయుధ వ్యక్తులను ప్రతిఘటించడం కనిపిస్తుంది. మరొక ఫోటోలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని నలుగురు-ఐదుగురు సాయుధ వ్యక్తులు స్ట్రెచర్‌పై ఆపరేషన్ థియేటర్ కు తీసుకువెళ్తున్నట్లు చూపిస్తోంది. ఈ ఇద్దరూ ఉగ్రవాదుల దగ్గర బందీలుగా ఉన్నారని IDF పేర్కొంది. అంతేకాదు ఈ బందీల్లో ఒకరు నేపాల్ కి చెందిన పౌరుడు అని మరొకరు థాయ్ పౌరుడిని… ఈ ఇద్దరిని ఇజ్రాయెల్ భూభాగం నుండి అపహరించినట్లు ఐడీఎఫ్ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ వెల్లడించారు.
https://twitter.com/IDF/status/1726319791865016493
ఈ బందీల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండనే విషయం తెలియదని చెప్పారు. అయితే తమ దేశంలో నరమేథం సృష్టించిన రోజున హమాస్ ఉగ్రవాదులు అల్-షిఫా ఆస్పత్రిని ఉపయోగించుకున్నారని ఈ వీడియోల ద్వారా స్పష్టమైంది అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. కాగా ఇప్పటికే ఆస్పత్రిలో అడుగుపెట్టిన ఇజ్రాయెల్ ఆర్మీ అంగుళం అంగుళం తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ సొరంగం గుర్తించినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా IDF విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సొరంగం 10 మీటర్ల లోతులో 55 మీటర్ల పొడవు ఉన్నట్లు వెల్లడించింది. ఆ సొరంగంలో ఏమున్నదనేది చెప్పలేదు. అయితే ఉగ్రవాదులతో జరుగుతున్న పోరులోఇప్పటి వరకూ 64 మంది ఇజ్రాయెల్ సైన్యం మృతి చెందినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..