Israel-Hamas War: ఖాతార్ మద్యవర్తిత్వం.. ఇజ్రాయేల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం..

Israeli–Palestinian Conflict: ఇజ్రాయేల్‌, హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో తొలిసారి శాంతి బీజాలు పడ్డాయి. బందీల విడుదల కోసం రెండు పక్షాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని రెండు పక్షాలు అంగీకారం కుదిరింది. రెండు పక్షాల మధ్య ఈ ఒప్పందాన్ని ఖతార్‌ కుదిర్చింది. అయితే ఎప్పటి నుంచి కాల్పుల విరమణ ఒప్పందం..

Israel-Hamas War: ఖాతార్ మద్యవర్తిత్వం.. ఇజ్రాయేల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం..
Israel Hamas War

Updated on: Nov 22, 2023 | 11:13 AM

Israeli–Palestinian Conflict: ఇజ్రాయేల్‌, హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో తొలిసారి శాంతి బీజాలు పడ్డాయి. బందీల విడుదల కోసం రెండు పక్షాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని రెండు పక్షాలు అంగీకారం కుదిరింది. రెండు పక్షాల మధ్య ఈ ఒప్పందాన్ని ఖతార్‌ కుదిర్చింది. అయితే ఎప్పటి నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయేల్‌ కేబినెట్‌ దాదాపు ఐదు గంటల పాటు చర్చించింది. నిన్న రాత్రి మొదలైన కేబినెట్‌ సమావేశం ఈ తెల్లవారుజాము వరకు సాగింది. మానవీయ కోణంలో ఆలోచించి కాల్పుల విరమణకు అంగీకరించామని హమాస్‌ ప్రకటించింది.

దాదాపు నెలన్నరగా ఇజ్రాయేల్‌-గాజా మధ్య యుద్ధం జరుగుతోంది. కాల్పుల విరమణ మాట వినిపించడం ఇదే మొదటిసారి. రెండు విడతల్లో ఈ నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుంది. ఇందులో భాగంగా గాజాలో బందీలుగా ఉన్న 50 మంది ఇజ్రాయిలీ మహిళలు, పిల్లలను హమాస్‌ విడుదల చేస్తుంది. అలాగే బందీలుగా ఉన్న 150 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయేల్‌ విడుదల చేస్తుంది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. హమాస్‌ అధీనంలో 240 మంది వరకు ఇజ్రాయేలీ పౌరులున్నట్టు సమాచారం.

ఇక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఈజిప్టు నుంచి గాజాకు సహాయ సామగ్రితో వచ్చే ట్రక్కులను అనుమతిస్తామని ఇజ్రాయేల్‌ ప్రకటించింది. రోజుకు 300 ట్రక్కుల నిండా సహాయ సామగ్రిని ఈజిప్టు పంపిస్తోంది. గాజాకు పెద్ద మొత్తంలో ఇంధన సరఫరాను కూడా ఇజ్రాయేల్‌ అనుమతిస్తుంది.

తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించిన పాలస్తీనాలో బందీలుగా ఉన్న తమ పౌరులను పూర్తిగా విడుదల చేసేవరకు యుద్ధం కొనసాగుతుందని మరో వైపు ఇజ్రాయేల్‌ స్పష్టం చేసింది. గాజా నుంచి ఇజ్రాయేల్‌లో ఎలాంటి ముప్పు లేకుండా చూసేందుకు హమాస్‌ను మట్టుబెడతామని ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత యుద్ధం యథావిధిగా కొనసాగుతుందని ఇజ్రాయేల్‌ ప్రకటించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..