ఇరాన్ సెక్యూరిటీ సుప్రీం అలీ లారిజానీ హతం..? ఇజ్రాయెల్ వాదనలో నిజమెంత..?

ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతుల్లా అలీ ఖమేనీ హత్య అనంతరం, టెహ్రాన్‌లోని రెండవ అత్యంత శక్తివంతమైన నాయకుడైన అలీ లారిజానీని ఇజ్రాయెల్ ఇప్పుడు లక్ష్యంగా చేసుకుంది. అలీ లారిజానీని తామే హతమార్చామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. అల్ జజీరా కథనం ప్రకారం, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ లారిజానీ మరణాన్ని స్వయంగా ప్రకటించారు.

ఇరాన్ సెక్యూరిటీ సుప్రీం అలీ లారిజానీ హతం..? ఇజ్రాయెల్ వాదనలో నిజమెంత..?
On March 13, Larijani Was Seen Walking The Streets Of Tehran

Updated on: Mar 17, 2026 | 3:55 PM

ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతుల్లా అలీ ఖమేనీ హత్య అనంతరం, టెహ్రాన్‌లోని రెండవ అత్యంత శక్తివంతమైన నాయకుడైన అలీ లారిజానీని ఇజ్రాయెల్ ఇప్పుడు లక్ష్యంగా చేసుకుంది. అలీ లారిజానీని తామే హతమార్చామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. అల్ జజీరా కథనం ప్రకారం, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ లారిజానీ మరణాన్ని స్వయంగా ప్రకటించారు. అయితే, ఇరాన్ ఈ వాదనను ఖండించింది.

ఇరాన్ సుప్రీం భద్రతా మండలి అధిపతి త్వరలో ఒక సందేశాన్ని జారీ చేస్తారని లారిజానీ కార్యాలయం పేర్కొంది. అంతకుముందు, సోమవారం రాత్రి (మార్చి 16) లారిజానీ స్థావరాలపై దాడి జరిగిందని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. మరోవైపు, ఈ దాడిలో లారిజాని మరణించారా లేదా అనే విషయంపై ఇజ్రాయెల్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. ఖమేనీ హత్య తర్వాత లారిజాని సైన్యాన్ని సమన్వయం చేస్తూ వచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనం ప్రకారం, యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశించగానే ఇజ్రాయెల్ లారిజానీని లక్ష్యంగా చేసుకుని, అతని స్థావరాలపై దాడి చేసిందని తెలిపారు. లారిజానీ గురించి ఇజ్రాయెల్ ఎక్కువ సమాచారాన్ని సేకరించలేకపోయింది. ఇదిలా ఉండగా, ఇరాన్‌లోని అతిపెద్ద పాక్షిక ప్రభుత్వ సంస్థ అయిన బసిజ్ ఫోర్స్ అధిపతి ఘోలం రెజా సోలేమానీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి.

అయతుల్లా అలీ ఖమేనీ హత్య తరువాత, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ప్రస్తుతం గాయపడినందున, అన్ని ప్రధాన నిర్ణయాలను తీసుకునే బాధ్యత లారిజానీదే. లారిజానీ ఇరాన్‌కు చెందిన అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు. జూన్ 2025లో, ఖమేనీ లారిజానిని సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా నియమించారు. యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇటీవల లారిజానిని హంతకుల జాబితాలో చేర్చి, అతని పట్టుకోవడానికి దారితీసే సమాచారం కోసం బహుమతిని ప్రకటించింది.

మరోవైపు సోషల్ మీడియా హ్యాండిల్ Xలో లారిజాని చివరి పోస్ట్ సోమవారం (మార్చి 16)న ఉంది. అందులో, అతను ఇరాన్ తరపున అన్ని ముస్లిం దేశాలకు ఒక లేఖ రాశారు. యూదు, క్రైస్తవ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడాలని లారిజాని పిలుపునిచ్చారు. ఇరాన్ ట్రంప్‌ను కూడా బెదిరించింది.

కాగా, లారిజాని ఇరాన్ అధ్యక్ష ఎన్నికలలో కూడా పోటీ చేశారు. కానీ గెలవలేకపోయారు. ఇరాన్‌లో లారిజానిని ఒక కఠిన వైఖరి గల నాయకుడిగా పరిగణిస్తారు. ఇదిలావుంటే, ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్‌పై తొలిసారి దాడి చేసినప్పుడు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సహా 40 మంది అగ్ర కమాండర్లు హతమయ్యారు. ఆ తర్వా నుంచి ప్రణాళికలో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సీనియర్ నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అయితే, ఇరాన్ నాలుగు-శ్రేణుల వారసత్వ సూత్రాన్ని అమలు చేసింది. దీని ప్రకారం, ఒక పదవిలో ఉన్న వ్యక్తి హత్యకు గురైతే, వారి వారసుడిని వెంటనే ప్రకటించవచ్చు. ఇరాన్ ఇప్పటికే ప్రతి పదవికి నలుగురు వారసులను సిద్ధం చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us