ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్.. అలా చేస్తే హర్మూజ్‌ను మళ్లీ మూసేస్తామని ప్రకటన..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా శాంతి మంత్రం పఠిస్తుంటే, మరోవైపు ఇరాన్ మాత్రం ఆ ప్రకటనలన్నీ పచ్చి అబద్ధాలంటూ నిప్పులు చెరుగుతోంది. ఇరాన్‌పై ఆర్థిక దిగ్బంధనం, ఆంక్షలు ఇలాగే ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని హెచ్చరించింది.

ట్రంప్‌కు ఇరాన్ గట్టి వార్నింగ్.. అలా చేస్తే హర్మూజ్‌ను మళ్లీ మూసేస్తామని ప్రకటన..
Iran Speaker Fires On Trump Posts

Updated on: Apr 18, 2026 | 7:54 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వరుస ప్రకటనలపై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ట్రంప్ చేస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలని, అబద్ధాలతో యుద్ధాలను గెలవలేరని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్‌ ఘాలిబఫ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హర్మూజ్ జలసంధి, శాంతి ఒప్పందానికి సంబంధించి ఒక గంటలోనే 7 చేశారని.. కానీ అందులోని ఏ ఒక్కటి నిజం కాదన్నారు. దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇరాన్ ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మూసివేస్తామని ఇరాన్ మరోసారి హెచ్చరించింది. ఇరాన్‌పై ఆర్థిక దిగ్బంధనం, ఆంక్షలు ఇలాగే కొనసాగితే, హర్మూజ్ జలసంధిని మూసివేయక తప్పదని ఘాలిబఫ్‌ హెచ్చరించారు.  ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతానికి పైగా ఈ జలసంధి ద్వారానే వెళ్తుంది.

యురేనియం తరలింపుపై ట్రంప్ ప్రకటన

మరోవైపు ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు తరలించేలా శాంతి ఒప్పందం జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. టెహ్రాన్‌లోని అణు కేంద్రాల నుండి రెండు దేశాలు సంయుక్తంగా యురేనియంను తొలగిస్తాయని ఆయన అన్నారు. అయితే యురేనియంను ఎక్కడికీ తరలించేది లేదని ఇరాన్ విదేశాంగ శాఖ గతంలోనే స్పష్టం చేయడం గమనార్హం. అయినప్పటికీ, ఒప్పందానికి ఎలాంటి అడ్డంకులు లేవని, పరిష్కారం చాలా దగ్గరలో ఉందని ట్రంప్ చెబుతన్నారు.

మార్కెట్లపై ప్రభావం: తగ్గిన చమురు ధరలు

హోర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ నుంచి వచ్చిన సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. బ్రెంట్ చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల గరిష్ట స్థాయి నుండి 90.38 డాలర్లకు పడిపోవడంతో వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించాయి.

యూకే, ఫ్రాన్స్ కొత్త మిషన్

హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు స్వేచ్ఛగా సాగేలా చేయడమే లక్ష్యంగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ రంగంలోకి దిగారు. త్వరలోనే ఒక స్పెషల్ మిషన్‌కు ఈ రెండు దేశాలు నాయకత్వం వహించనున్నాయి.

లెబనాన్-ఇజ్రాయెల్ పరిస్థితులు

మరోవైపు ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో లెబనాన్ ఇకపై ఏ యుద్ధాలకూ వేదిక కాబోదని ఆ దేశ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ప్రకటించారు. అయితే కాల్పుల విరమణ జరిగినప్పటికీ ఘర్షణలు పూర్తిగా ఆగలేదు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఒక వ్యక్తి మరణించారు. మార్చి 2 నుండి జరిగిన దాడుల్లో లెబనాన్‌లో దాదాపు 2,300 మంది మరణించినట్లు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది.

Follow Us