Iran-Israel conflict: ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. విమాన ప్రయాణికులకు షాక్

| Edited By: Velpula Bharath Rao

Oct 04, 2024 | 12:49 PM

ఇజ్రాయెల్ ఇరాన్‌ల మధ్య జరుగుతున్న ఘర్షణతో హైదరాబాద్ నుంచి అమెరికాకు వయా లండన్ ద్వారా వెళ్తున్న ప్రయాణికులకు టికెట్లు ధరలతో చుక్కలు కనిపిస్తున్నాయి. విమాన టిక్కెట్ల ధరలు 50 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి విమానాలు మళ్లించడంతో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి అమెరికాకు విమాన ప్రయాణ ఖర్చులు భారీగా పెరిగాయి .

Iran-Israel conflict: ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. విమాన ప్రయాణికులకు షాక్
Flight Prices Hiked
Follow us on

ఇజ్రాయెల్ ఇరాన్‌ల మధ్య జరుగుతున్న ఘర్షణతో హైదరాబాద్ నుంచి అమెరికాకు వయా లండన్ ద్వారా వెళ్తున్న ప్రయాణికులకు టికెట్లు ధరలతో చుక్కలు కనిపిస్తున్నాయి. విమాన టిక్కెట్ల ధరలు 50 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి విమానాలు మళ్లించడంతో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి అమెరికాకు విమాన ప్రయాణ ఖర్చులు భారీగా పెరిగాయి . హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాల్సిన విమానాలు వయా లండన్ వెళుతుండడంతో విమానాల టికెట్ ధరలు రూ. 1.5 లక్షల మార్క్ దాటాయి.

సాధారణంగా టిక్కెట్ ధరలు రూ. 90,000 నుంచి రూ. 1 లక్ష వరకు ఉంటాయి. కానీ తాజా ఘటనల కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాలు దాటే విమాన సర్వీసులు రద్దు చేయడంతో ఇతర మార్గాలు మళ్లించడం వల్ల టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి. కాంటినెంటల్‌తోపాటు అనేక ఇతర విమాన సర్వీసులు హైదరాబాదు నుంచి న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్‌ఫ్రాన్సిస్కో, అట్లాంటా, హ్యూస్టన్ నగరాలకు టిక్కెట్ ధరలను పెంచాయి. డల్లాస్ వంటి నగరాలకు ప్రస్తుతం టిక్కెట్లు రూ. 3 లక్షలకు చేరుకున్నాయి. లుఫ్తాన్సా విమాన సర్వీసులు హైదరాబాదు, ముంబయ్ వంటి నగరాలకు తమ సర్వీసులను రద్దు చేశాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ కారణంగా మిడిల్ ఈస్ట్ దాటే సర్వీసులు రద్దు చేయబడుతున్నాయి. యూఎస్, యూకే వెళ్లే భారతీయ ప్రయాణికులకు గణనీయంగా ధరలు పెరిగాయి. హైదరాబాద్ నుంచి వెళ్లే వారికి పెరిగిన టికెట్ ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్దం పలు ఆంశాల్లో ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తుంది. ఇటీవలే ఇరాన్ వందకుపైగా క్షిమిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌కు అగ్రదేశమైనా అమెరికా మద్దతు పలుకుంది. దీంతో ఈ ఘర్షణ మరో యుద్దానికి దారి తీస్తుందేమోనని ఆయా దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.