Inmates at St. Louis jail Set Fire: కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాలు కట్టడి చర్యలు చేపట్టాయి. దీంతో జైల్లో ఉన్న ఖైదీలను చూడడానికి వచ్చే బంధువులను సైతం పరిమితంగానే అనుమతిస్తున్నారు. ఇక మరోవైపు కోర్టులో కేసుల విచారణను నిలిపేశారు. దీంతో ఖైదీల్లో అసహనం పెరిగిపోయింది. జైల్లో నానాభీభత్సం సృష్టించారు. ఈ ఘటన అమెరికాలోని యింట్ లూయిస్ జైల్లో ఖైదీల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…
శనివారం తెల్లవారుజామున ఖైదీలు బీభత్సం సృష్టించారు.జైలు అధికారులతో ఘర్షణకు దిగారు. జైలు నాలుగో అంతస్తులో కిటికీలను, పైప్‌లను ధ్వంసం చేశారు. కుర్చీలు, మంచాలు, పరుపులకు నిప్పు పెట్టారు. ఖైదీలను అధికారులు ఎంతో కష్టపడి శాంతింపజేశారు. చివరకు ఉదయం 10 గంటలకల్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అర్పివేశారు. ఈ జైల్లో 633 మంది ఖైదీలు ఉంటారని.. వారిలో దాదాపు 115 మంది బీభత్సం సృష్టించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఘటనలో ఖైదీలెవరూ గాయపడలేదు. ఓ అధికారి స్వల్పంగా గాయపడగా, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. సెయింట్ లూయిస్ జైలు నుంచి 65 మంది ఖైదీలను డౌన్‌టౌన్ జైలుకు తరలించారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై అదనపు చర్యలు తీసుకోనున్నామని అధికారులు తెలిపారు.
Also Read: