
ప్రపంచంలో రకరకాల పాములు ఉన్నాయి. పాము అంటే చాలామందికి భయం.. అది విష సర్పం కావడంతో.. కాటేస్తే.. ప్రాణాలే పోయే ప్రమాదం ఉండటంతో ఎక్కువమంది భయపడుతూ ఉంటారు. కొంతమంది మాత్రం పాములతో స్నేహం చేస్తారు. వాటిని పెంచుకుంటారు కూడా. పాముల గురించి చెప్పగానే నాగుపాము, కట్ల పాము, రక్తపింజరి, కింగ్ కోబ్రాల గురించి తెలుసు.. మనకు తెలిసే ఇవే విషపూరితమైన పాములు.. చిన్న చిన్న పాములు కాటేస్తే.. తక్షణమే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. అదే పైన చెప్పిన విష సర్పాలు కాటేస్తే మాత్రం వెరీ డేంజర్ అనుకుంటాం. కాని వీటన్నింటికి మించి విషపూరితమైన పాము ఆస్ట్రేలియాలో ఉంటుంది. దాని పేరు ఇన్లాండ్ తైపాన్. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముగా గుర్తింపు పొందింది. ఈ విషసర్పం ఒకకాటుతో 110 మిల్లీగ్రాముల విషాన్ని విడుదల చేస్తుందని తేలింది. దీంతో 100 మంది వ్యక్తులను, లేదా రెండు లక్షల 50 వేల ఎలుకలను చంపవచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
ఈ ప్రమాదకర పాములు ఆస్ట్రేలియాలో తప్ప మరెక్కడా కనిపించవు. అది కూడా మారుమూల అటవీప్రాంతాల్లోనే సంచరిస్తుంటాయని పరిశోధనలో వెల్లడైంది. ఈ పాములు పగటిపూట కనిపించడం చాలా తక్కువ అని పరిశోధకులు తెలిపారు. ఇన్లాండ్ తైపాన్ పాము సగటున 1.8 మీటర్ల పొడవు పెరుగుతుంది. వీటి కోరలు 3.5 నుంచి 6.2 మిల్లిమీటర్ల పొడవు ఉంటాయి.
ఇన్లాండ్ తైపాన్ పాములు ఋతువులను అనుసరించి చర్మం రంగును మార్చుకుంటాయని పరిశోధకులు వెల్లడించారు. చలికాలంలో ముదురు గోధుమ రంగులోనూ, వేసవిలో లేత గోధుమ రంగులోనూ కనిపిస్తాయి. ఎలుకలు, కోడిపిల్లలను ఇవి ఆహారంగా తీసుకుంటాయట. విశ్వంలో దాదాపు 600 విషపూరిత పాములు ఉన్నప్పటికి.. కేవలం అత్యంత విషపూరితమైన పాములు దాదాపు 200 వరకు ఉన్నాయి. ఈ పాములు కాటేస్తే ప్రాణాలకే ప్రమాదం.. కాని తాజాగా యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ కు చెందిన పరిశోధకుల అధ్యయనం ప్రకారం ఇన్లాండ్ తైపాన్ పాము అత్యంత విషపూరితమైనదిగా తేలింది. ఈ పాము ఒక కాటుకే వంద మంది ప్రాణాలకు ప్రమాదమని వెల్లడైంది. ఈ సర్పం విషం చాలా ప్రభావంతమైనదని పరిశోధకులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..