Afghanistan: మాకు సహాయం చేసేందుకు ఆపన్నహస్తం అందించండి.. భారత్ కు అఫ్గాన్ విన్నపం

|

Jun 03, 2022 | 7:54 AM

అఫ్గానిస్థాన్(Afghanistan) ను చేతుల్లోకి తీసుకుని, అధికారం చేపట్టిన తాలిబన్ ప్రభుత్వానికి చేయూత అందించాలని భారత్ ను అఫ్గాన్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు భారత అధికారుల బృందం అఫ్గాన్ అధికారులతో భేటీ అయ్యారు. ఇరు దేశాల...

Afghanistan: మాకు సహాయం చేసేందుకు ఆపన్నహస్తం అందించండి.. భారత్ కు అఫ్గాన్ విన్నపం
India Afghanistan
Follow us on

అఫ్గానిస్థాన్(Afghanistan) ను చేతుల్లోకి తీసుకుని, అధికారం చేపట్టిన తాలిబన్ ప్రభుత్వానికి చేయూత అందించాలని భారత్ ను అఫ్గాన్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు భారత అధికారుల బృందం అఫ్గాన్ అధికారులతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై, అక్కడి ప్రజలకు అందిస్తున్న మానవతా సహాయంపై చర్చ జరిగింది. తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తమ దేశంతో భారత్(India) ఏర్పరుచుకున్న సంబంధాలను తిరిగి కొనసాగించాలని అఫ్గాన్ ప్రతినిధులు కోరారు. ఇండియా చేపట్టిన ప్రాజెక్టులను తిరిగి పునఃప్రారంభించడం, దౌత్యపరమైన కార్యకలాపాలను తిరిగి కొనసాగించడం, అఫ్గాన్‌ విద్యార్థులు, రోగులకు దౌత్యపరమైన సేవలను అందించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తమతో వాణిజ్యం కొనసాగించే విషయాన్నీ పరిశీలించాలని కోరారు. గతేడాది ఆగస్టు 15 తర్వాత అఫ్గాన్‌లో భద్రతా పరిస్థితులు క్షీణించాయి. దీంతో అక్కడ ఉన్న భారత అధికారులందరు స్వదేశానికి వచ్చేశారు. అయినా ఇక్కడి నుంచే అఫ్గాన్ లో ఉన్న సిబ్బంది రాయబార కార్యాలయ నిర్వహణ చూసుకున్నారని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు.

అఫ్గానిస్థాన్‌తో భారత్‌కు చారిత్రక సంబంధాలు ఉన్నాయి. ఈ బంధాలు తమ విధానాన్ని కొనసాగించేందుకు దోహదపడుతాయి. ఈ క్రమంలోనే తాలిబన్ల సీనియర్‌ నాయకులతో భారత బృందం భేటీ అయ్యింది. అఫ్గాన్‌ ప్రజలకు భారత్‌ అందిస్తున్న సహాయాన్ని అందించడంపై చర్చ జరిగింది.

        – అరిందమ్ బాగ్చి, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి