Modi US Visit: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే అధికారిక కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని పలు టాప్ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా తొలుత క్వాల్‌కమ్ సీఈఓ క్రిస్టియానో అమోన్‌తో సమావేశమయ్యారు. అనంతరం అడోబ్, ఫస్ట్ సోలార్ అండ్ బ్లాక్‌స్టోన్ వంటి ప్రధాన సంస్థల అధినేతలతో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మోడీ వారితో చర్చించారు.
సీఈవోలతో భేటీ ముగిసిన తర్వాత ఒక్కొక్కరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్వాల్కమ్ సీఈవో క్రిస్టియానో మాట్లాడుతూ.. ‘భారత్ పెట్టుబడులకు స్వర్గధామమని కొనియాడారు. భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని. మోడీ పాలనలో వ్యాపారాభివృద్ధికి మంచి అవకాశాలు ఏర్పడ్డాయన్నారు. 5జీ టెక్నాలజీపై భారత్‌తో కలిసి పనిచేస్తామని క్రిస్టియానో వెల్లడించారు.
ఇక అడోబ్ సీఈఓ శంతను నారాయణతోనూ మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్‌లో అడోబ్ కార్యకలాపాలు, భవిష్యత్ పెట్టుబడుల ప్రణాళికలపై చర్చించారు. డిజిటల్ ఇండియా ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆరోగ్యం, విద్యా రంగంలో అభివృద్ధిపై చర్చించారు. ఇదిలా ఉంటే 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ అమెరికాలో పర్యటించడం ఇది ఏడోసారి. ఇక శుక్రవారం యూఎన్ జనరల్ అసెంబ్లీలో మోడీ ప్రసంగించనున్నారు.
Also Read: LIC IPO: డ్రాగన్ కంట్రీకి మోడీ సర్కార్ మరో ఝలక్.. ఇక ముందు భారత్‌లోకి అలా నో ఎంట్రీ..
America Vs China: చైనాకు నిద్ర లేకుండా చేస్తున్న అమెరికా ఆ రెండు నిర్ణయాలు.. ఎందుకో తెలుసా?