Suella Braverman: భారత సంతతికి చెందిన న్యాయవాది సుయెల్లా బ్రెవర్మాన్ అరుదైన ఘనత సాధించారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన సుయెల్లా బ్రెవర్మాన్ బ్రిటన్ హోంశాఖ మంత్రిగా నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన మరో మహిళ ప్రీతి పటేల్ స్థానంలో బ్రెవర్మాన్ ఆ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. రెండు రోజుల క్రితం బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో కొత్త క్యాబినెట్‌ను విస్తరిస్తున్నారు. 42 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ నేత అయిన బ్రెవర్మాన్.. గత బోరిస్ ప్రభుత్వంలో అటార్నీ జనరల్‌గా చేశారు. బ్రెవర్మాన్‌ను హోంశాఖ మంత్రిగా కొత్త ప్రధాని లిజ్ నియమించారు.
సుయెల్లా బ్రెవర్మాన్‌కు ఇద్దరు పిల్లలు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించిన సుయెల్లా… 2018లో రాయల్ బ్రెవర్మాన్‌ను పెళ్లి చేసుకున్నారు. బ్రెవర్మాన్ బౌద్ద మతాన్ని స్వీకరించారు. ఆమె తరచూ లండన్ బుద్దిస్ట్ సెంటర్‌కు వెళ్తుంటారు. బుద్ధుడి బోధనలైన ధమ్మపాద ప్రకారం ఆమె పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక సుయెల్లా తల్లిదండ్రులు ప్రస్థాన పరిశీలించగా…
సుయెల్లా బ్రెవర్మాన్ తల్లి తమిం..తండ్రి గోవా ఆర్జిన్‌కు చెందిన వ్యక్తి.ఆమె పేరు ఉమ. ఆయన పేరు క్రిస్టీ ఫెర్నాండేజ్. మారిషస్ నుంచి తల్లి బ్రిటన్‌కు వలస రాగా, 1960 దశకంలో తండ్రి కెన్యా నుంచి వలస వెళ్లారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రెవర్మాన్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. తమ పేరెంట్స్ బ్రిటన్‌ను ఎంతో ప్రేమించారని, వాళ్లకు ఆ దేశం ఆశను కల్పించిందని, వాళ్లకు భద్రతను ఇచ్చిందని చెప్పుకొచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి