‘నా కళ్ల ముందే నా భార్యకు ఆపరేషన్ చేశారు’.. ఆస్పత్రిపై 1 బిలియన్ డాలర్స్ దావా వేసిన భర్త..

|

Sep 19, 2023 | 4:56 PM

ఒక గర్భిణీ స్త్రీ సాధారణ ప్రసవానికి ప్రయత్నించినప్పుడు.. వారికి కొద్దిగా ప్రేరణ అవసరం. ఆమె పక్కన ఉన్న ఎవరైనా మంచి మాటలు చెప్పడం.. వారిని ప్రోత్సహిస్తుండాలి. తద్వారా వారు ప్రసవ వేదన నుంచి కాస్త రిలీఫ్‌ పొందుతారు. అయితే, మహిళ ప్రసవం సమయంలో ఆమెను ప్రోత్సహించేందుకు ఉత్తమ సపోర్టర్‌ భర్తే అని చెప్పాలి. అందుకే.. డెలివిరీ సమయంలో వైద్యులను సదరు మహిళల భర్తలనుకూడా ఆపరేషన్ థియేటర్‌లోకి అనుమతిస్తారు. అయితే, ఈ సన్నివేశం కొందరికి మరుపురాని సన్నివేశం అయితే.. మరికొందరికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఓ వ్యక్తి ఇలాగే ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బంది కారణంగా మానసిక సమస్యలు కూడా ఎదుర్కొన్నాడట. ఇంకేముంది.. ఆస్పత్రి కారణంగానే తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, ఆస్పత్రిపై 1 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల దావా వేశాడు. ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నా కళ్ల ముందే నా భార్యకు ఆపరేషన్ చేశారు.. ఆస్పత్రిపై 1 బిలియన్ డాలర్స్ దావా వేసిన భర్త..
Women Delivery
Follow us on

ఒక గర్భిణీ స్త్రీ సాధారణ ప్రసవానికి ప్రయత్నించినప్పుడు.. వారికి కొద్దిగా ప్రేరణ అవసరం. ఆమె పక్కన ఉన్న ఎవరైనా మంచి మాటలు చెప్పడం.. వారిని ప్రోత్సహిస్తుండాలి. తద్వారా వారు ప్రసవ వేదన నుంచి కాస్త రిలీఫ్‌ పొందుతారు. అయితే, మహిళ ప్రసవం సమయంలో ఆమెను ప్రోత్సహించేందుకు ఉత్తమ సపోర్టర్‌ భర్తే అని చెప్పాలి. అందుకే.. డెలివిరీ సమయంలో వైద్యులను సదరు మహిళల భర్తలనుకూడా ఆపరేషన్ థియేటర్‌లోకి అనుమతిస్తారు. అయితే, ఈ సన్నివేశం కొందరికి మరుపురాని సన్నివేశం అయితే.. మరికొందరికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఓ వ్యక్తి ఇలాగే ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బంది కారణంగా మానసిక సమస్యలు కూడా ఎదుర్కొన్నాడట. ఇంకేముంది.. ఆస్పత్రి కారణంగానే తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, ఆస్పత్రిపై 1 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల దావా వేశాడు. ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మెల్‌బోర్న్‌లో భారత సంతతికి చెందిన అనిల్ కొప్పుల తన భార్యను డెలివరీ కోసం మెల్‌బోర్న్‌లోని రాయల్ ఉమెన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డెలివరీ సమయంలో భర్తను కూడా ఆపరేషన్ థియేటర్‌లోనికి అనుమతించారు వైద్యులు. ఆస్పత్రిలో ప్రసవం సమయంలో భార్యకు సపోర్ట్‌గా భర్త ఆపరేషన్‌ థియేటర్‌కు వెళ్లాడు. భర్త కళ్ల ముందే.. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. సీసెక్షన్‌ను అతని కళ్లెదుటే చేశారు. ఆపరేషన్ పూర్తయ్యే వరకు అంతా బాగానే ఉంది కానీ, ఆ తరువాత అతనిలో మానసిక సమస్యలు మొదలయ్యాయట. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సదరు హాస్పిటల్‌పై దావా వేశాడు. డెలివరీని చూసేందుకు ఆస్పత్రి వర్గాలు తనను ప్రోత్సహించి, ఆపరేషన్ థియేటర్‌లోకి అనుమతిచ్చారని సదరు వ్యక్తి ఆరోపించారు. సర్జరీ చూసిన తరువాత తన మానసిక పరిస్థితి క్షీణించిందని, దీనికి పరిహారం చెల్లించాలంటూ ఆస్పత్రిపై 1 బిలియన్ డాలర్ల దావా వేశాడు.

వాస్తవానికి అనిల్ కొప్పుల, అతని భార్యకు 2018లో ఒక బిడ్డకు జన్మనిచ్చారు. వైద్యులు ఆమెకు సి సెక్షన్ ద్వారా డెలివరీ చేశారు. అయితే, ఈ ఆపరేషన్‌ను ప్రత్యక్షంగా చూడటం వలన తాను మానసికంగా కుంగిపోయానని, చివరకు తన వివాహ బంధం విచ్ఛిన్నమైందని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నాడు అనిల్. ఈ కారణంగా తనకు ఆస్పత్రి నుంచి పరిహారం ఇప్పించాలని కోరాడు. ఆపరేషన్ సమయంలో తన భార్య అవయవాలను, రక్తాన్ని చూడాల్సి వచ్చిందని, దాని ఫలితంగా మానసికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నానని చెప్పాడు అనిల్.

దీనిపై విచారణ జరిపిన కోర్టు.. అతని పిటిషన్‌ను కొట్టేసింది. కొప్పుల అనిల్ సంరక్షణ బాధ్యతను ఉల్లంఘించడాన్ని రాయల్ ఉమెన్స్ ఆస్పత్రి యాజమాన్యం ఖండించింది. ప్రసవ సమయంలో అనిల్ కొప్పుల ఆస్పత్రిలో ఉన్నంత కాలంలో అతనికి ఎలాంటి ఇబ్బంది కలుగలేదని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. న్యాయమూర్తి జేమ్స్ గోర్టన్.. ఈ పిటిషన్‌ను నిరర్ధకమైనదిగా పేర్కొంటూ కొట్టేశారు. విచారణలో భాగంగా కొప్పుల అనిల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన న్యాయస్థానం.. అనిల్ శారీరక బలహీనత తీవ్రమైనదిగా ఏమీ లేదని, పరిహారం చెల్లించడానికి ఇది సరైన కారణం కాదంటూ పిటిషన్‌ను కొట్టేసింది.

మరిన్నిఅంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..