Oxygen: నేపాల్‌కు భారత్ చేయూత.. ఆక్సిజన్ సరఫరా చేసేందుకు అంగీకారం..

| Edited By: Ram Naramaneni

May 18, 2021 | 8:41 AM

India will provide liquid oxygen to Nepal: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాలా దేశాల్లో ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లో

Oxygen: నేపాల్‌కు భారత్ చేయూత.. ఆక్సిజన్ సరఫరా చేసేందుకు అంగీకారం..
liquid oxygen
Follow us on

India will provide liquid oxygen to Nepal: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాలా దేశాల్లో ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లో కూడా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో ఓ వైపు ఆక్సిజన్, ఆసుపత్రుల్లో మౌలికవసతులు, పలు ఔషధాల కొరత, మరోవైపు వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత్ మరోసారి గొప్పమనసును చాటుకుంది. మన పొరుగు దేశం నేపాల్‌కు ఆక్సిజన్ సరఫరా చేయడానికి అంగీకరించింది. రానున్న 8 నుంచి 10 రోజుల్లో భారత్ నుంచి నేపాల్‌కు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా జరుగుతుందని నేపాల్‌లోతీ భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం నేపాల్‌లో కూడా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నేపాల్‌కు భారత్ అండగా ఉంటుందని వినయ్ మోహన్ స్పష్టం చేశారు. ఇప్పటికే నేపాల్‌కు 2 మిలియన్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు పంపినట్లు ఆయన వివరించారు. కాగా.. నేపాల్‌లో సోమవారం 9,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా తమ ప్రజలెవరూ నేపాల్ వెళ్లద్దని ఆంక్షలు విధించింది. కాగా భారత్ ఈ ఏడాది ప్రారంభంలో పలు దేశాలకు వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి ఉదారత చాటుకున్న విషయం తెలిసిందే. తాజాగా నేపాల్‌కు సాయం చేసేందుకు ముందడుగు వేసింది.

Also Read:

Plasma Therapy: ఐసీఎంఆర్ కీలక నిర్ణయం.. కోవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా థెరపి తొలగింపు

నారదా కేసు చల్లారిపోయిందా? బెంగాల్ మంత్రులకు బెయిల్ మంజూరు చేసిన సీబీఐ స్పెషల్ కోర్టు, బీజేపీపై నేతల ఫైర్