India vs Pakistan: జమ్ములోని యూరీ సెక్టర్‌లో పాక్‌ దాడులు.. తిప్పికొడుతున్న భారత సైన్యం

జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడికి ప్రయత్నించిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఎలాంటి నష్టం జరగలేదని 'ఎక్స్' వేదికగా తెలిపింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి. ఉరి సెక్టార్‌లో జనావాసాలు లక్ష్యంగా పాక్‌ దాడులు పాల్పడుతుండగా.. భారత్ కౌంటర్ అటాక్ ఇస్తోంది.

India vs Pakistan: జమ్ములోని యూరీ సెక్టర్‌లో పాక్‌ దాడులు.. తిప్పికొడుతున్న భారత సైన్యం
India Vs Pakistan

Updated on: May 09, 2025 | 12:39 AM

జమ్మూకశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో జనావాసాలు లక్ష్యంగా పాక్‌ దాడులు పాల్పడుతోంది. యూరీలో యుద్ధ వాతావరణం నెలకొంది. బాంబుల మోతలతో యూరీ ప్రాంతం దద్దరిల్లుతోంది. యూరీలో కాల్పులకు తెగబడుతుఉన్న పాకిస్తాన్‌ను భారత సైన్యం తిప్పికొడుతోంది. కాల్పులతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బంకర్లలోకి పరుగులు పెడుతున్నారు. ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.

ఢిల్లీలో హై అలెర్ట్…. 

ఢిల్లీలోని ప్రధాన ప్రాంతలతో పాటు ముఖ్యమైన సంస్థల దగ్గర ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఢిల్లీలోని ప్రధాన ప్రదేశాలైన ఇండియా గేట్, కుతుబ్ మినార్, ఎర్రకోట దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనితో పాటు, ఢిల్లీ పోలీసులు ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, దౌత్యకార్యాలయ దగ్గర కూడా భద్రతను పెంచారు.

ఎనిమిది క్షిపణులతో  పాకిస్థాన్‌ సైన్యం దాడులకు తెగబడింది.  దాడులకు దిగిన 8 పాక్‌ క్షిపణులను కూల్చినట్లు రక్షణవర్గాల వెల్లడించాయి. పాకిస్థాన్‌ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది.