ఇవాళ రాత్రే బిగ్ డీల్..! అందరిచూపు పెద్దన్న వైపే.. భారత్‌కు కలిసొచ్చేనా..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలపై విధించిన పన్ను నిర్ణయాలపై ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తన షరతులకు ఒప్పుకుంటే ఓకే.. లేకపోతే భారీగా టారీఫ్‌లు విధిస్తున్నారు. ఇప్పటికే చైనా, బ్రిటన్‌లతో డీల్ కుదిరిందని చెప్పిన ట్రంప్.. భారత్‌తో ఒప్పందానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.

ఇవాళ రాత్రే బిగ్ డీల్..! అందరిచూపు పెద్దన్న వైపే.. భారత్‌కు కలిసొచ్చేనా..
India Us

Updated on: Jul 08, 2025 | 4:06 PM

ట్రంప్ అధికారంలోకి వచ్చాక మిగితా దేశాలపై ట్యాక్సులతో విరుచుకుపడుతున్నారు. ఎడాపెడా పన్నులు విధిస్తూ తన షరతులకు ఒప్పుకునేలా చేస్తున్నాడు. ఇప్పటికే చైనా, భారత్ సహా ఎన్నో దేశాలపై ట్రంప్ పన్ను విధించారు. అయితే వాటిని 90రోజుల పాటు నిలిపివేశారు. ఆ తర్వాత పలు దేశాలతో సరికొత్త ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఈ కోవలోనే భారత్ చేరనున్నట్లు తెలుస్తోంది. భారత్‌తో ఒక అద్భుత డీల్ జరగబోతుంది.. ఇది చాలా స్పెషల్ అంటూ ట్రంప్ ఇటీవలే వ్యాఖ్యానించారు. దీంతో ఏంటా డీల్ అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. టారీఫ్‌లకు సంబంధించి 14 దేశాలకు ట్రంప్ లేఖలు రాశారు. ఇప్పటికే బ్రిటన్, చైనాలతో ఒప్పందలు కుదిరినట్లు తెలిపారు. దీంతో ఆయా దేశాలపై టారీఫ్‌లు తాత్కాలికంగ తగ్గించినట్లు వివరించారు. మిగితా దేశాలు సైత తమ షరతులకు దిగిరావాలని.. లేకపోతే తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటారని ట్రంప్ హెచ్చరించారు. తమ షరతులకు ఒప్పుకోకపోతే ఎంత టారీఫ్‌లు విధిస్తామో ఆయా దేశాలకు లేఖలు రాసినట్లు తెలిపారు.

భారత్‌తో డీల్.. దాదాపుగా ఖరారైందని ట్రంప్ అన్నారు. భారత్ – అమెరికా మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ ట్రేడ్ డీల్ ఇవాళ రాత్రి 10గంటలకు ప్రకటించే అవకాశముందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా గతంలో ప్రకటించిన 10శాతం బేస్‌లైన్ టారిఫ్‌లు ఒప్పందం తర్వాత కూడా కొనసాగుతాయని తెలుస్తోంది.
అయితే ఈ ఒప్పందంలో భాగంగా.. వస్త్ర, తోలు ఉత్పత్తులు వంటి శ్రమతో కూడిన రంగాలకు ఊరట దక్కే అవకాశం ఉందని సమాచారం. అయితే వ్యవసాయ ఉత్పత్తులు ఈ మినీ ట్రేడ్ డీల్‌లో భాగం కావు అని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి ఇరు దేశాల అధికారుల మధ్య చర్చలు సాగుతున్నాయి.

ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ట్రంప్ గతంలో విధించినటువంటి 26శాతం పన్నులు మళ్లీ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దేశానికి సంబంధించిన ఒప్పందాల విషయంలో భారత్ తొందరపడదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. డెడ్ లైన్ల ఆధారంగ ఒప్పందాలు కుదుర్చుకోమన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే మేము అమెరికాతో ఒప్పందంపై సంతకం చేస్తామని చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.