కోవిడ్ వైరస్ ఎక్కించుకునే వలంటీర్లు ? కొత్త తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్న బ్రిటన్

| Edited By: Anil kumar poka

Feb 17, 2021 | 7:04 PM

కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు బ్రిటన్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. 18 నుంచి 30 ఏళ్ళ మధ్య వయస్సుగల వారికీ స్వల్ప మోతాదులో కోవిడ్ వైరస్ ఎక్కిస్తే ఎలా ఉంటుందన్న...

కోవిడ్ వైరస్ ఎక్కించుకునే వలంటీర్లు ?  కొత్త తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్న బ్రిటన్
Follow us on

కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు బ్రిటన్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. 18 నుంచి 30 ఏళ్ళ మధ్య వయస్సుగల వారికీ స్వల్ప మోతాదులో కోవిడ్ వైరస్ ఎక్కిస్తే ఎలా ఉంటుందన్నదానిపై అధ్యయనం చేస్తున్నారు అక్కడి రీసెర్చర్లు.. ప్రపంచంలో ఈ తరహా ప్రయోగం చేయడం ఇదే మొట్టమొదటిసారి. ఇందుకు సుమారు 90 మంది వలంటీర్లను ఎంపిక చేసే యోచనలో ఉన్నారు. మొదట క్లినికల్ ఎపిక్స్ సంస్థ నుంచి అనుమతి రాగానే సుమారు నెల రోజుల్లోగా ఈ ప్రయోగాన్ని చేపట్టాలనుకుంటున్నారు. అయితే ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే వైరస్ ని అతి తక్కువ స్థాయిలో..కంట్రోల్డ్ పద్దతిలో ఇచ్చి ట్రయల్స్ నిర్వహించాలన్నది వీరి ఆలోచనగా ఉంది. వ్యాక్సిన్ల అభివృధ్ది, చికిత్సలో తోడ్పడేందుకు, మరింత శక్తిమంతమైన టీకా మందులను ఉత్పత్తి చేసేందుకు కూడా తమ స్టడీ దోహదపడుతుందని భావిస్తున్నారు. లండన్ లోని రాయల్ ఫ్రీ హాస్పిటల్స్ భాగస్వామ్యంతో ప్రభుత్వం భారీ నిధులతో ఇందుకు నడుం కట్టింది.

కోవిడ్ ను పూర్తిగా అదుపు చేసేందుకు ఏ వ్యాక్సిన్లు సమర్థంగా పని చేస్తాయో తెలుసుకునేందుకు కూడా ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. అయితే వలంటీర్ల సహకారం కూడా అవసరమని పరిశోధకులు అంటున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

CM Jagan Photos : శారదాపీఠం వార్షిక మహోత్సవాల్లో ‘సీఎం జగన్’‌ ప్రత్యేక పూజలు..

Chief Guest Jr NTR: కరోనా కూడా వాక్సిన్ ఉంది కానీ ఇలాంటి వాటికీ ఎలాంటి వాక్సిన్ లు లేవు : జూనియర్ ఎన్టీఆర్.