బహ్రెయిన్ లో శ్రీకృష్ణుని గుడి.. ‘ కొబ్బరికాయ ‘ కొట్టిన మోదీ

|

Aug 25, 2019 | 12:43 PM

బహ్రెయిన్ లో హిందువుల గుడి.. అందులోనూ కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుని ఆలయం వెలుస్తోంది. . బహ్రెయిన్ రాజధాని మనామాలో ప్రధాని మోదీ శనివారం బ్రహ్మాండమైన శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణ ప్రాజెక్టును లాంచ్ చేశారు. అక్కడ అతి పురాతనమైన.. సుమారు 200 ఏళ్ళ నాటి కృష్ణుని గుడి పునరుధ్ధరణ కోసం 4. 2 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు. మొదట మోదీ.. ఈ పురాతన ఆలయంలో ప్రార్థనలు చేశారు. మనామాలోని శ్రీనాథ్ జీ […]

బహ్రెయిన్ లో శ్రీకృష్ణుని గుడి..  కొబ్బరికాయ  కొట్టిన మోదీ
Follow us on

బహ్రెయిన్ లో హిందువుల గుడి.. అందులోనూ కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుని ఆలయం వెలుస్తోంది. . బహ్రెయిన్ రాజధాని మనామాలో ప్రధాని మోదీ శనివారం బ్రహ్మాండమైన శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణ ప్రాజెక్టును లాంచ్ చేశారు. అక్కడ అతి పురాతనమైన.. సుమారు 200 ఏళ్ళ నాటి కృష్ణుని గుడి పునరుధ్ధరణ కోసం 4. 2 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు. మొదట మోదీ.. ఈ పురాతన ఆలయంలో ప్రార్థనలు చేశారు. మనామాలోని శ్రీనాథ్ జీ (శ్రీకృష్ణుని) టెంపుల్ పునరుధ్ధరణ పనులు ఈ సంవత్సరాంతంలో ప్రారంభం కానున్నాయి. 16, 500 చదరపు అడుగుల స్థలంలో… 30 మీటర్ల ఎత్తున.. నాలుగు అంతస్థులతో ఈ ఆలయం రూపు దిద్దుకోనుంది. ఈ రీ-డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై అక్కడి ప్రభుత్వం అత్యంత శ్రధ్ధ పెట్టడం విశేషం. ఈ దేశాన్ని విజిట్ చేసిన తొలి భారత ప్రధాని కావడం తన అదృష్టమని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మూడు రోజుల పర్యటనకు గాను ఆయన ఈ గల్ఫ్ దేశాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయనకు యుఎఈ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘ ఆర్డర్ ఆఫ్ జాయేద్ ‘ ని ఇఛ్చి సత్కరించింది. భారత-బహ్రయిన్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత అభివృధ్ది పరచేందుకు మోదీ అక్కడి ప్రభుత్వంతో విస్తృత చర్చలు జరిపారు. రూపే కార్డును, మహాత్మా గాంధీ స్మారక తపాలా బిళ్లలను ఆయన విడుదల చేశారు. కాగా- జీ-7 సమ్మిట్ కు హాజరయ్యేందుకు మోదీ ఆదివారం ఫ్రాన్స్ కు బయల్దేరి వెళ్లారు.